ఈ రోజు విడుదలకానున్న OnePlus 6T విడుదల కానున్నట్లు వెల్లడి: ఈ ఫోన్ యొక్క సేల్ నవంబర్ 1 నుండి మొదలు
ఈ ఫోన్ యొక్క విడుదల ఈ రోజు రాత్రి 8:30 నిముషాలకు మొదలవుతుంది.
వన్ ప్లస్ కంపెనీ యొక్క ఫ్లాగ్ షిప్ ఫోన్ అయినటువంటి OnePlus 6T స్మార్ట్ ఫోన్ ని ఈ రోజు రాత్రి 8:30 నిముషాలకి విడుదలచేయనుంది. అయితే, ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 30వ తేదికి విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, అదే తేదీన ఆపిల్ యొక్క మరొక కార్యక్రమం ఉండటం వలన దీని విడుదల ఈ రోజుకి మార్చడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్లో, గమనించదగ్గ చాలా మార్పులే చేసినట్లు తెలుస్తోంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC మరియు డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివాటిని వీటిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు.
ఈ కార్యక్రమం న్యూయార్క్ లో జరగనుంది, ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 11(EDT) గంటలకి మొదలవుతుంది. అంటే, మన కాలమాన ప్రకారం రాత్రి 8:30 గంటలకి జరగనుంది.
OnePlus 6T ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ పైన వచ్చిన పుకార్ల నుండి, ఈ ఫోన్ 19.5:9 యాపెక్ట్ రేషియాతో 1080X2340 పిక్సెళ్ళు అందించగల ఒక 6.4 అంగుళాల ఆప్టిక్ అమోల్డ్ డిస్ప్లే ని కలిగివుంటుంది మరియు డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC మరియు ఆడ్రెనో 630 GPU శక్తితో జతగా వస్తుంది, అలాగే అత్యధికంగా 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది.
లీక్స్ ద్వారా వచ్చిన స్పెక్స్ ప్రకారం, 16MP ప్రధాన మరియు 20MP సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమేరాతో వస్తుంది మరియు ముందు భాగంలో, 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ 3,700mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రీ అర్దర్లు అమేజాన్ నుండి మొదలయ్యాయి మరియు నవంబర్ 1 వ తేదినుండి సేల్ మొదలవ్వనున్నాయి.