OnePlus 6T స్మార్ట్ ఫోన్ డిస్ప్లే లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ డ్రాప్ నోచ్ మరియు స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రత్యేకతలతో $549 ధరతో విడుదలయ్యింది

Updated on 30-Oct-2018
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ డిస్ప్లే లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రత్యేకంగా ఉంటుంది. మిగిలిన స్పెక్స్, దాదాపుగా OnePlus 6 ని పోలివుంటాయి.

వారంరోజుల టీజింగ్స్,  లీక్స్ మరియు అనేక నివేదికల తరువాత, OnePlus ఇప్పుడు అధికారకంగా విడుదలైంది. ఈ ఫోన్లో అంతర్గత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రత్యేకంగా చూపిస్తోంది, మరియు 3.5mm జాక్ లేకుండా, వాటర్ డ్రాప్ నోచ్ తో తీసుకొచ్చింది వన్ ప్లస్. వన్ ప్లస్ 6T లోని వాటర్ డ్రాప్ నోచ్ ని గమనిస్తే, Oppo F9 Pro లోని నోచ్ వలెనే కనిపిస్తుంది మరియు ఈ రెండు ఫోన్లకు కూడా పేరెంట్ కంపెనీ BBK ఎలక్ట్రానిక్స్ కావడం కూడా ఒక విశేషం.

OnePlus 6T ప్రత్యేకతలు

ఇక ఈ OnePlus 6T స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ ఫోన్ 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.41 అంగుళాల ఆప్టిక్ అమోల్డ్ వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు ఇది 402ppi పిక్సెళ్ళ సాంద్రతని అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో అందించబడినది మరియు ఈ వాటర్ డ్రాప్ నోచ్ సహాయంతో బాడీ తో స్క్రీన్ యొక్క నిష్పత్తిని 86శాతానికి ఉంచగలిగామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ని దాదాపుగా బెజెల్లు లేని విధంగా చేసారు, ఇది నిజంగా ఒక మంచి పనితనమని చెప్పవచ్చు. అలాగే,  బ్రైట్నెస్ లెవల్, కలర్ ఖచ్చితత్వం, మరియు డిస్ప్లే యొక్క కలర్ పరిమితి వంటి వాటికీ ఈ ఫోన్ సరిచేయబడినదని, వన్ ప్లస్ వివరించింది.

ముందునుండి అనుకున్నట్లుగానే, వన్ ప్లస్ 6T  2.8Ghz క్లాక్ వేగంగల క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 SoC తో శక్తిని పొందింది మరియు 6GB ర్యామ్ జతగా 128GB అంతర్గత స్టోరేజి మరియు 8GB ర్యామ్ జతగా 256GB అంతర్గత స్టోరేజి వంటి రేడు వేరియంటలలో లభిస్తుంది. ఇది LPDDR4X ర్యామ్ మరియు UFS 2.12-Lane  స్టోరేజిని కలిగి ఉంటుంది. లీకైన గీక్ బెంచ్ మరియు AnTuTu స్కోర్ల ప్రకారం, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత తాజా ఆక్సిజన్ OS తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త OS, అప్డేటింగ్ గేమ్ మోడ్ మరియు స్మార్ట్ బూస్ట్ వంటి చాల మెరుగుదలలను తీసుకొచ్చినట్లు చెబుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఈ ఫోన్ లో ముందుగా వచ్చిన ఫోన్ల వంటి కెమెరాలనే అందించినట్లు తెలుస్తోంది. వెనుక భాగంలో, Sony IMX519 సెన్సార్ గల 16MP ప్రధాన కెమేరా  జతగా Sony IMX376 సెన్సార్ గల 20MP తో డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ ప్రధాన 16MP కేమెరా, 1.22μm పిక్సెల్స్ తో  f/1.7 ఆపేర్చేరుతో వస్తుంది, అయితే రెండవ 20MP సెన్సర్ కూడా f/1.7 ఆపేర్చేరు  1.0μm పిక్సెల్ పిచ్ తో వస్తుంది.

వెనుక కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ (OIS) కి సపోర్ట్ చేస్తుంది, మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ (EIS) కు మద్దతు ఇస్తుంది మరియు AIS కూడా పరికరంలో ఉపయోగించబడుతుంది. ఫోన్ యొక్క ప్రధాన కెమెరాతో 30/60 fps, 30/60 fps వద్ద పూర్తి HD వీడియో, 30 fps వద్ద 720P వీడియో మరియు 1080p మరియు 720p రిజల్యూషన్ వద్ద సూపర్ స్లో మోషన్ వీడియోలను వరుసగా 240 fps మరియు 480 fps వద్ద 4K వీడియోని షూట్ చేయవచ్చు. అయితే, దీనితో 980fps వద్ద సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేయలేము. ఫోన్ దాని మునుపటి కంటే తక్కువ మెరుగైన తక్కువ-కాంతి చిత్రాలను సంగ్రహించడానికి సహాయపడుతుంది అని కంపెనీ చెప్పే ఒక కొత్త నైట్స్ స్కేప్ మోడ్ వస్తుంది. కొత్తగా అభివృద్ధి చెందిన నైట్ HDR కూడా ఉంది, ముఖ్యంగా ఈ ప్రయోజనం కోసం నైట్స్ స్కేప్ కోసం అభివృద్ధి చేసారు. ఈ క్రొత్త ఫీచర్ త్వరలోనే OnePlus 6 కు ప్రసారం అవుతుంది, కానీ ఖచ్చితమైన తేదీ ఇవ్వబడలేదు.

ఈ ఫోన్ ముందుభాగంలో,  f / 2.0 అపర్చరు గల ఒక 16MP ని ఉంచారు, ఇది EIS మరియు ఒక 1.0μm పిక్సెల్ పరిమాణం తో సోనీ IMX 371 సెన్సార్ ఉంది. ఈ  సెన్సార్  వాటర్ డ్రాప్ నోచ్ లో ఉంచబడుతుంది, దీనిలో ఒక పరిసర, డిస్టెన్స్ మరియు RGB సెన్సార్ వంటి మూడింటిని కలిగి ఉంది. ఈఫోన్ – OnePlus 6 లాగే, ఫోన్ సెట్టింగుల నుండి నోచ్ ని దాచగలదు. ఈ మొత్తం ప్యాకేజీ 3700mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది, ఇది  23 శాతం అదనపు కాలాన్ని బట్వాడా చేసేలా   చేయబడింది.    

OnePlus 6T ధరలు

OnePlus 6T యొక్క 6GB + 128GB వెర్షన్ $ 549 (రూ 40,277) ధరతో ఉంటుంది, 128 GB నిల్వతో దాని 8GB RAM కోసం $ 578 (సుమారుగా 42,400 రూపాయలు) ఖర్చు చేయవల్సివుంటుంది. ఈ పరికరం యొక్క 8GB + 256GB మోడల్ కూడా ఉంది, ఇది $ 629 (సుమారు 46,100 రూపాయలు) ధరతో వస్తుంది. నవంబర్ 1 నుండి US లో మరియు యూరోప్ లో నవంబర్ 6 నుండి స్మార్ట్ఫోన్ షిప్పింగ్ను ప్రారంభిస్తుంది. ఫోన్ యొక్క భారతదేశంలో దాని  ధరను రేపు దాని స్థానిక ప్రయోగ కార్యక్రమంలో వెల్లడిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :