అఫీషియల్ అనౌన్స్ కి ముందే OnePlus 5T ప్రీ ఆర్డర్స్ కి అవైలబుల్ .
OnePlus 5T ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు, అయితే ఇది ఇప్పటికే చైనీస్ రిటైలర్ అయిన Oppomart వెబ్సైట్లో చేరింది. ఫోన్ యొక్క ధర $ 549, Rs 35,600రూ. గా చూపిస్తుంది. లిస్ట్ ప్రకారం, ఈ ఫోన్ 18: 9 యాస్పెక్ట్ రేషియో మరియు క్వాడ్ HD రిజల్యూషన్ తో వస్తుంది .
లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ కూడా ఒక ప్లస్ 5 వంటి 20MP మరియు 16MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉందని సూచిస్తుంది, కానీ అపార్చర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ 3450mAh ఉంటుంది, వన్ ప్లస్ 5 బ్యాటరీ 3300 mAh గా ఉంటుంది.
ఫోన్ యొక్క ఇతర ఫీచర్స్ కూడా ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ 5 వలె ఉంటాయి, క్వాల్కామ్ యొక్క స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ , 6GB RAM / 64 GB స్టోరేజ్ మరియు 8GB RAM / 128 GB స్టోరేజ్ వేరియంట్స్ లో కూడా లభిస్తుంది.
కొన్ని రోజుల క్రితం, ఇటాలియన్ వెబ్సైట్ Gizchina.it అప్కమింగ్ డివైస్ కోసం AnTuTu లిస్టింగ్ పేర్కొన్నారు. దీని ప్రకారం, ఫోన్ మోడల్ A5010 మరియు ఒక 20MP డ్యూయల్ వెనుక కెమెరా ఉంటుంది.
అయితే, OnePlus ఇంకా దీని గురించి ధ్రువీకరించలేదని గమనించాలి.ఒప్పో మార్ట్ గతంలో OnePlus 3 మరియు OnePlus 3T లను లాంచ్ కి ముందే లిస్ట్ చేసింది, కానీ లిస్ట్ లో ఇవ్వబడిన స్పెక్స్ ఫైనల్ డివైస్ కి కి చాలా భిన్నమైనదిగా తేలింది .