oneplus 5 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో 22 జూన్ న లాంచ్ చేస్తున్నారు
Oneplus 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలదు
చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Oneplus యొక్క సరికొత్త oneplus 5 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో 22 జూన్ న లాంచ్ చేస్తున్నారు .
చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Oneplus యొక్క అపకమింగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Oneplus 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలదు . కంపెనీ యొక్క CEO Pete Lau ఈ విషయాన్ని ధృవీకరించారు. '' Oneplus 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC ఉందని చెప్పటానికి చాలా సంతోషంగా ఉందని చెప్పారు .
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలిగిన స్మార్ట్ ఫోన్ గా ఇది భారత్ లో లభించే మొదటి స్మార్ట్ ఫోన్ అవుతుంది . Oneplus 5 గురించి ఇప్పటివరకు అనేక లీక్స్ వచ్చాయి . లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం Oneplus 5 లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు .
ఆండ్రాయిడ్ అథారిటీఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక కొత్ లీక్ ను వెల్లడించింది . లీకైన ఇమేజెస్ ప్రకారం DUAL కెమెరా సెటప్ కలదు .
Oneplus 5 స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో 6GB RAM మరియు 8GB RAM ఆప్షన్స్ వుంటాయని సమాచారం . OnePlus 5 లో 4000mAh బ్యాటరీ కలదు.