నిన్న రాత్రి oneplus కంపెని కొత్త మొబైల్ లాంచ్ చేసింది చైనాలో. ఇది oneplus 3 కు అప్ గ్రేడ్ మోడల్. పేరు oneplus 3T.
రెండింటికీ కేవలం నాలుగు మేజర్ తేడాలున్నాయి. మరింత పవర్ ఫుల్ ప్రొసెసర్, పెద్ద బ్యాటరీ, ఇంప్రూవ్ చేయబడ్డ ఫ్రంట్ కెమెరా మరియు పెరిగిన స్టోరేజ్ కెపాసిటీ.
prices విషయానికి వస్తే.. Oneplus3T కూడా రెండు స్టోరేజెస్ లో వస్తుంది. 64GB వేరియంట్ స్టార్టింగ్ 29,800 రూ నుండి మొదలై 31,200 రూలకు మరియు 33,700 రూ వరకూ ఉంది.
128GB స్టోరేజ్ వేరియంట్ కూడా స్టార్టింగ్ 32,500 రూ లకు స్టార్ట్ అయ్యి, 34,800 రూ మరియు 37,100 రూ లకు వెళ్తుంది ఫోన్.
స్పెక్స్ – సో కొత్త ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 821 ప్రొసెసర్, 128GB స్టోరేజ్ వేరియంట్, 16MP ఫ్రంట్ కెమెరా Samsung 3P8SP 1-micron పిక్సెల్స్ అండ్ PDAF, 3400 mah బ్యాటరీ అనే మార్పులు జరిగాయి. మిగిలిన వన్నీ same.
సిమిలర్ స్పెక్స్ – 5.5 in FHD Optic అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, 6GB LPDDR4 రామ్, dash చార్జింగ్, డ్యూయల్ సిమ్, 4G LTE, బ్లూ టూత్ 4.2, anodised అల్యూమినియం మెటల్ unibody , ఫింగర్ ప్రింట్, USB టైప్ 2.0 C పోర్ట్, హెడ్ ఫోన్ జాక్, 158 గ్రా బరువు
నవంబర్ 22 US లో ఫోన్ సేల్స్ మొదలు. ఇది ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా స్పష్టత లేదు.