5 నెలల క్రితం వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ మోడల్‌గా మార్కెట్లో లాంచ్ అయిన OnePlus 3T స్మార్ట్‌ఫోన్ ఇక మార్కెట్ లో లభించదు. త్వరలో డిస్కంటిన్యూ అవ్వబోతుంది. ఎందుకంటే OnePlus 5 లాంచ్ చేసే పనిలో కంపెనీ నిమగ్నమయ్యి వుంది. అందుకే దీనిని నిలిపివేస్తున్నట్లు సమాచారం . వన్‌ప్లస్ 3టీని కొనుగోలు చేసేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్ , స్టాక్ అయిపోవచ్చింది. వేర్‌హౌస్‌లో కొన్ని యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి, వెంటనే త్వరపడండంటూ వన్‌ప్లస్ ఫోరమ్ స్టాఫ్ మెంబర్ స్టీవెన్ జి తెలిపారు.
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్లో రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలు' ఫ్రంట్ అండ్ రేర్, సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హెచ్డీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. 5.5 ఇంచెస్ 1080 పిక్సల్ డిస్ప్లే , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం . ఫింగర్ ప్రింట్ సెన్సార్, usb టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కు డాష్ ఛార్జ్ టెక్నాలజీ, , 4GLTE డ్యుయల్ వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ,డ్యూయల్ సిమ్ ,వంటి ఫీచర్స్ కలిగి వుంది.