Oneplus కంపెని నుండి europe లో ఆల్రెడీ రిలీజ్ అయిన Oneplus 3T స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో అనౌన్స్ అయ్యింది. ఇది oneplus 3 కు అప్ గ్రేడ్ మోడల్.
ఆల్రెడీ సక్సెస్ ఫుల్ overall బెస్ట్ value for money స్మార్ట్ ఫోన్ గా 28 వేలకు oneplus 3 ఇతర ఫ్లాగ్ షిప్ ఫోనులకు గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు oneplus 3T ప్రైస్ కూడా అదే highend రేంజ్ లో ఉంది.
64GB వేరియంట్ Oneplus 3T ప్రైస్ 29,999 రూ అండ్ 128GB వేరియంట్ ప్రైస్ 34,999 రూ. ఇలా చూస్తుంటే మంచి స్పెక్స్ అండ్ పనితనం ఇస్తున్నా oneplus కూడా నెమ్మదిగా highend రేంజ్ లోకి వేలిపోతున్నట్లు అనిపిస్తుంది.
Oneplus 3T స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G VoLTE, స్నాప్ డ్రాగన్ 821 క్వాడ్ కోర్ 2.35GHz ప్రొసెసర్(ఇదే ప్రొసెసర్ ప్రస్తుతం గూగల్ పిక్సెల్ అండ్ ఆసుస్ జెన్ ఫోన్ 3 డీలక్స్ లో ఉంది)
5.5 in optic amoled గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, 6GB LPDDR4 రామ్, 16MP సోనీ IMX298 సెన్సార్ with OIS అండ్ EIS, PDAF అండ్ 16MP సామ్సంగ్ 3P8SP సెన్సార్ ఫ్రంట్ కెమెరా..
ఫింగర్ ప్రింట్ స్కానర్, dash charge ఫాస్ట్ చార్జింగ్, 3400 mah బ్యాటరీ, USB 2.0 టైప్ C పోర్ట్, బ్లూ టూత్ 4.2 తో వస్తున్నా ఈ ఫోన్ బరువు 158 గ్రా.
గన్ మెటల్ కలర్, గ్రాఫైట్ కలర్స తో అమెజాన్ ఇండియాలో లో డిసెంబర్ 14 నుండి Oneplus 3T సేల్స్ మొదలు. సాఫ్ట్ గోల్డ్ వేరియంట్ రావటానికి కొంత టైం పడుతుంది.
Oneplus 3 మరియు 3T కు ఉన్న తేడాలు:
ప్రొసెసర్, బ్యాటరీ అండ్ high resolution కెమెరా.