Oneplus బ్రాండ్ నుండి Oneplus 3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవబోతుంది తొందరలోనే. అయితే నిన్న ఈ ఫోన్ లో 6GB ర్యామ్ ఉంటుంది అని రిపోర్ట్స్ వచ్చాయి.
రీసెంట్ గా ఈ రోజు బెంచ్ మార్క్ లిస్టింగ్ లో కూడా 6GB ర్యామ్ ఉంది అని రిపోర్ట్స్.. ఇంకా ప్రొసెసర్ స్నాప్ డ్రాగన్ 820 1.5GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది.
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో ఉంది OS. అయితే స్క్రీన్ మాత్రం 5in FHD డిస్ప్లే అని ఉంది. స్టోరేజ్ 64GB సేమ్. 16MP and 8MP కేమేరాస్.
అయితే 6GB తో పాటు మరొకటి 4GB ర్యామ్ తో రానుంది అని తెలుస్తుంది. కంపెని మాత్రం ఇప్పటివరకు ఈ ఫోన్ పై కేవలం సరి కొత్త డిజైన్ మార్పులు చేస్తున్నట్లే వెల్లడించింది.
మొదటి oneplus మోడల్ కు users అందరూ ఎలాంటి ఎక్సైట్మెంట్ పొందారో ఈ మోడల్ కు కూడా అలానే ఉంటుంది మార్కెట్ అని కంపెని హెడ్ తెలిపారు.
oneplus రాబోయే మోడల్ US లో కూడా unlocked హ్యాండ్ సెట్స్ గా సేల్ కానుంది. ఇది డైరెక్ట్ గా oneplus నుండే సేల్స్ జరుగుతాయి.