చైనా బేస్డ్ OnePlus కంపెని మొదటి మోడల్ oneplus వన్ స్మార్ట్ ఫోన్ చైనా కన్నా ఇండియాలోనే ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యింది. ఇప్పుడు ఈ కంపెని జులై 27 న రెండవ మోడల్, One Plus Two ను లాంచ్ చేస్తుంది.
అయితే మొట్ట మొదటి సారిగా OnePlus VR టెక్నాలజీ తో ఈ లాంచ్ ఈవెంట్ చేస్తుంది. ప్రపంచలో ఎవరు ఈ ఈవెంట్ ను చూద్దామని అనుకున్నా VR నుండి చూడగలరు. VR అంటే వర్చ్యువల్ రియాలిటీ. ఇది ఫ్యూచర్ ను తన సొంతం చేసుకోనున్న టెక్నాలజీ. గూగల్ దీని సృష్టి కర్త. వన్ ప్లస్ ఇందుకోసం ఫ్రీ గా VR లను తన అధికారిక వెబ్ సైటు లో సేల్ చేయనుంది. ఈ లింక్ లో చూడగలరు. ఇది గూగల్ కార్డ్ బోర్డ్ VR వలే ఉంటుంది కాని కొన్ని మార్పులుతో ఉండనుంది. అయితే కేవలం one ప్లస్2 మోడల్ కొనే వారికేనా లేక అందరికీ ఫ్రిగా ఇవ్వనుందా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
ఇది స్నాప్ డ్రాగన్ 810 SoC ప్రొసెసర్ పై నడవనుంది. ఈ ప్రొసెసర్ ఇప్పటికే హీటింగ్ ఇష్యూస్ తో చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంది. కాని వన్ ప్లస్ ఇది కొత్త 810 SoC వెర్షన్ అని క్లారిఫై చేసింది. దీనిలో కొన్ని థర్మల్ కౌంటర్ మెజర్స్ ను తీసుకుంది కంపెని. తాజాగా USB టైప్ C పోర్ట్ కూడా ఇందులో ఉంది అని రివీల్ చేసింది కంపెని.
OnePlus సీఈఓ , కార్ల్ పే వన్ ప్లస్ 2, oneplus one కన్నా ఎక్కువ ధరలో ఉంటుంది అని చెప్పారు. అయినా సరే ఈ కంపెని రిలీజ్ చేసిన మొదటి మోడల్ స్టేటిస్టిక్స్ ప్రకారం వన్ ప్లస్ 2 స్నాప్ డ్రాగన్ 810 SoC వాడే ఫోనులలో బెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాము. సోనీ, మోటోరోలా మరియు ఆపిల్ కూడా రెండు మూడు నెలల్లో వాటి ఫ్లాగ్ షిప్( హై ఎండ్ ఫోన్) ఫోనులను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
ఆధారం: OnePlus Forum