OnePlus 13R భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!

Updated on 13-Jan-2025
HIGHLIGHTS

OnePlus 13R స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచే మొదటిసారిగా అమ్మకాలు మొదలు

ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

OnePlus 13R స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచే మొదటిసారిగా అమ్మకాలు మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

OnePlus 13R : ప్రైస్ & ఆఫర్స్

వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేసిక్ 12GB + 256GB వేరియంట్ రూ. 42,999 ధరతో, హై ఎండ్ 16GB + 512GB వేరియంట్ రూ. 49,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు గొప్ప బ్యాంక్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

ఈ స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 4,000 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను 30 వేల కంటే తక్కువ ధరకే అందుకోవచ్చు.

Also Read: గ్రౌండ్ షేకింగ్ Sony 600W Soundbar పై అమెజాన్ సేల్ జబర్దస్త్ అఫర్ అందుకోండి.!

OnePlus 13R : ఫీచర్స్

వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ ProXDR LTPO 4.1 స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ Glass GG7i ప్రొటెక్షన్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్, 12GB/16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB/512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 50MP Sony LYT-700 మెయిన్, 50MP S5KJN5 టెలిఫోటో మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ 60fps వద్ద 4K Video రికార్డ్ సపోర్ట్ మరియు AI Camera సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీని 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :