OnePlus 13r: పవర్ ఫుల్ చిప్సెట్ మరియు వన్ ప్లస్ AI సపోర్ట్ తో వస్తోంది.!
OnePlus 13r స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్ చేసింది
వన్ ప్లస్ AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్
OnePlus 13r స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన కంపెనీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని పవర్ ఫుల్ చిప్సెట్ మరియు వన్ ప్లస్ AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఈ ఫోన్ టీజర్ పేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
OnePlus 13r: లాంచ్
వన్ ప్లస్ 13r స్మార్ట్ ఫోన్ జనవరి 7న ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ గత కొంత కాలంగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ని సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, అమెజాన్ కూడా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించి టీజింగ్ చేస్తోంది.
Also Read: JBL Dolby Soundbar పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డీల్ : 6 వేలకే సౌండ్ బార్ అందుకోండి.!
OnePlus 13r: కీలకమైన ఫీచర్స్
వన్ ప్లస్ 13r స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. అంతేకాదు ఈ ఫోన్ లో OnePlus AI సపోర్ట్ ఉంటుందని కూడా వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో పవర్ కెమెరాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ AI నోట్స్, AI రిఫ్లెక్షన్ ఎరేజర్, AI అన్ బ్లర్, AI డీటెయిల్ బూస్ట్ మరియు మరిన్ని AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ తో లైఫ్ టైం వారెంటీ కూడా అందించబోతున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో గ్రీ లైన్ ప్రాబ్లమ్ ఉండదని చెప్పడానికి కంపెనీ ఈ లైఫ్ టైం వారెంటీ గురించి ప్రస్తావించింది.