OnePlus 13R స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో OnePlus 12R రేటుకే విడుదల చేసింది.!
OnePlus 13 Series ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
OnePlus 13R ను గొప్ప ఫీచర్స్ తో OnePlus 12R రేటుకే విడుదల చేసింది
వన్ ప్లస్ 13R ని స్నాప్ డ్రాగన్ పవర్ ఫుల్ ప్రోసెసర్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది
OnePlus 13 Series ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. వీటిలో OnePlus 13R స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో OnePlus 12R రేటుకే విడుదల చేసింది. అయితే, వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ని గూగుల్ Gemini సపోర్ట్, స్నాప్ డ్రాగన్ పవర్ ఫుల్ ప్రోసెసర్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఇండియాలో సరికొత్తగా విడుదలైన ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మరియు ప్రైస్ పై ఒక లుక్కేద్దాం పదండి.
OnePlus 13R : ప్రైస్
వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ రూ. 42,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధరను బేసిక్ వేరియంట్ అయిన 12GB + 256GB వేరియంట్ కోసం నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ 16GB + 512GB వేరియంట్ ను రూ. 49,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ పై రూ. 7,000 డిస్కౌంట్ అందుకునే ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను OnePlus 12R రేటుకే ఈ ఫోన్ ను అందుకోవచ్చు.
ఆఫర్లు మరియు సేల్
ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ను మరియు రూ. 3,000 రూపాయల ICICI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 35,999 రూపాయల ధరకు అందుకోవచ్చు.
వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు oneplus.com నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: భారీ ఆఫర్స్ తో Great Republic Day Sale ప్రకటించిన Amazon
OnePlus 13R : ఫీచర్స్
వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 12GB/16GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB/512GB (UFS 4.0) ఇంటర్నల్ స్టోరేజ్ ను జత చేసింది. ఈ ఫోన్ పటిష్టమైన గొరిల్లా గ్లాస్ GG7i ప్రొటెక్షన్ కలిగిన 6.78 ఇంచ్ ProXDR LTPO 4.1 స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ ;అను కల్గి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony LYT-700) మెయిన్, 50MP (S5KJN5) టెలిస్కోప్ మరియు 8MP అల్ట్రా వైడ్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ 4K వీడియో లను 60fps/30fps వద్ద రికార్డ్ చేయగల సత్తా కలిగి వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది మరియు ఈ ఫోన్ AI Camera ఫీచర్స్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ లో 6000mAh హెవీ బ్యాటరీని 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. వన్ ప్లస్ 13R స్మార్ట్ ఫోన్ IP65 రేటింగ్ మరియు next-gen Aqua Touch 2.0 ఫీచర్స్ తో అందించింది.