OnePlus 13: వన్ ప్లస్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ ప్లస్ ప్రీమియం అండ్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13 ఈరోజు ఇండియాలో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ ను 24GB ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ తో పాటు పవర్ ఫుల్ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ ను సమంజసమైన ధరలో అందుకునేందుకు వీలుగా తగిన ఆఫర్స్ ను కూడా ఈ ఫోన్ తో జతగా అందించింది.
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను 3168×1440 (QHD+) రిజల్యూషన్ కలిగిన 6.82 ఇంచ్ 120Hz ProXDR స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ బ్రైట్నెస్, సిరామిక్ గార్డ్, HDR Vivid, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్ సెట్ పవర్ తో అందించింది. ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ కి జతగా 12GB/16GB/24GB LPDDR5X ర్యామ్ మరియు 256GB/512GB/1TB UFS 4.0 స్టోరేజ్ లతో అందించింది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP ( Sony LYT-808) మెయిన్, 50MP (Sony LYT-600) టెలిఫోటో మరియు 50MP (S5KJN5) అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ గరిష్టంగా 30fps వద్ద 8K Video రికార్డ్, 4K Dolby Vision వీడియోలను 60 fps/30 fps వద్ద షూట్ చేయగలదు. ఈ ఫోన్ లో OnePlus AI సపోర్ట్ వుంది మరియు చాలా AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో పవర్ ఫుల్ సిలికాన్ నానో స్టాక్ బ్యాటరీ వుంది మరియు ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W ఎయిర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో అందించింది. ఈ మూడు వేరియంట్ రేట్లు క్రింద చూడవచ్చు.
వన్ ప్లస్ 13 (12GB + 256GB) ధర : రూ. 69,999
వన్ ప్లస్ 13 (16GB + 512GB) ధర : రూ. 79,999
వన్ ప్లస్ 13 (24GB + 1TB) ధర : రూ. 89,999
Also Read: OnePlus 13R స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో OnePlus 12R రేటుకే విడుదల చేసింది.!
ఈ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ పై రూ. 7,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పై HDFC బ్యాంక్ 24 నెలల No Cost EMI ఆఫర్ తో పాటు ప్రముఖ బ్యాంక్ కార్డ్స్ పై 12 నెలల No Cost EMI ఆఫర్ కూడా అందించింది.