OnePlus 13 Launched: వన్ ప్లస్ కొత్త ఫోన్ 24GB ర్యామ్ మరియు 1TB స్టోరేజ్ తో లాంచ్.!
వన్ ప్లస్ కొత్త ఫోన్ OnePlus 13 ను విడుదల చేసింది
వన్ ప్లస్ ప్రీమియం సిరీస్ 13 నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది
24GB హెవీ ర్యామ్ మరియు 1TB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది
OnePlus 13 Launched: వన్ ప్లస్ కొత్త ఫోన్ ను విడుదల చేసింది. వన్ ప్లస్ ప్రీమియం సిరీస్ 13 నుంచి ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను 24GB హెవీ ర్యామ్ మరియు 1TB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను లాంచ్ చేసింది ఇండియాలో కాదనుకోండి. వన్ ప్లస్ ఈ ప్రీమియం ఫోన్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. నేడు సరికొత్తగా విడుదలైన ఈ వన్ ప్లస్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకుందామా.
OnePlus 13 Launched:
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్ లో ¥4,299 (సుమారు రూ. 54,000) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ ను ¥5,299 (సుమారు రూ. 63,000) ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను వైట్ డ్యూ డాన్, ఓడిషియన్ సీక్రెట్ రెల్మ్ మరియు బ్లూస్ హావర్ మూడు కలర్ లలో అందించింది. ఈరోజు నుంచిం చైనా లో ఈ ఫోన్ ప్రీ సేల్ ను కూడా ప్రారంభించింది.
OnePlus 13 (China) : ఫీచర్స్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చడానికి వీలుగా ఈ ఫోన్ లో LPDDR5X 24GB ర్యామ్ మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 31,86,834 AnTuTu స్కోర్ నమోదు చేసినట్లు వన్ ప్లస్ తెలిపింది. ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ 4.32GHz క్లాక్ స్పీడ్ తో మరియు Adreno 830 GPU తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP సూపర్ టెలిఫోటో కలిగిన మెయిన్ కెమెరా సిస్టం మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 30fps వద్ద 8K వీడియోలు మరియు 60fps/30fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చని వన్ ప్లస్ తెలిపింది. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో కూడా 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ముఖ్యంగా, ఈ ఫోన్ ఫ్రంట్ మరియు బ్యాక్ కెమెరాతో 4K Dolby Vision వీడియోలు షూట్ చేసే అవకాశం వుంది.
Also Read: Flipkart Sale చివరి రోజు మోటోరోలా Edge 50 Pro 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
ఈ ఫోన్ 6000mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ ను కలిగి ఉంటుంది మరియు ఇది అల్ట్రా ఫస్ట్ కేహార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు సిరామిక్ గ్లాస్ రక్షణ కలిగిన 6.82 ఇంచెస్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ QHD+ (3168×1440) రిజల్యూషన్, 4500nit పీక్ బ్రైట్నెస్ మరియు 1-120Hz ఇంటెలిజెంట్ స్విచ్చింగ్ రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది.
అయితే, ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు.