OnePlus 13 Launch: వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ 13 సిరీస్ ఫోన్ లాంచ్ కోసం వన్ ప్లస్ డేట్ అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేయబోతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ అవుతుంది ఇండియాలో కాదండోయ్ చైనా మార్కెట్లో అని గుర్తుంచుకోండి. అయితే, ఎప్పటి లాగానే చైనా మార్కెట్ లో లాంచ్ తర్వాత ఇండియా మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేయడం మొదలు పెట్టారు.
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను చైనా కాలమానం ప్రకారం అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు మరియు వివరాలు తెలియ పరిచేలా ఈ ఫోన్ ఇమేజ్ లతో కంపెనీ వెబ్సైట్ నుంచి టీజింగ్ మొదలు పెట్టింది. ఈ ఫోన్ ఇమేజ్ లను చూస్తుంటే, ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ మరియు సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు కనిపిస్తుంది.
వన్ ప్లస్ చైనీస్ వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ మూఢుడు కలర్ ఆప్షన్ లలో కనిపిస్తోంది. ఇందులో ప్రీమియం బ్లూ లెథర్ వేరియంట్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ వీడియో ద్వారా మరిన్ని వివరాలు కూడా బయటపెట్టింది.
ఈ ఫోన్ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ గా అర్థం అవుతోంది. అది కూడా ఈ ఫోన్ లో HASSELBLAD సపోర్ట్ కలిగిన ట్రిపుల్ కెమెరా ఉన్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ లో క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ఉన్నట్లు కూడా అర్థం అవుతోంది. వన్ ప్లస్ 12 ఫోన్ ను 4th Gen Hasselblad తో అందించింది. వన్ ప్లస్ 13 ఫోన్ మరింత అడ్వాన్స్డ్ కెమెరా సిస్టం తో అందించే అవకాశం వుంది.
ఇక ఈ ఫోన్ డిజైన్ మరియు మరిన్ని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో ప్రీమియం మెటల్ ఫ్రేమ్ తో తయారు చేయబడినట్లు కూడా కనిపిస్తోంది. ఇది కాకుండా, ఈ ఫోన్ లో ఎడమవైపు పై భాగంలో ప్రత్యేకమైన బటన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో చాలా తక్కువ అంచులు మరియు ఎక్కువ స్క్రీన్ కలిగిన స్క్రీన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో టైప్ C ఛార్జ్ సపోర్ట్ మరియు డ్యూయల్ స్పీకర్లు ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.
Also Read: Samsung లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ దివాళీ సేల్ ధమాకా ఆఫర్.!
ఈ ఫోన్ లాంచ్ \కోసం చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ ను కంపెనీ త్వరలోనే అందిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.