OnePlus 13 india launch date confirmed to 7th January 2025
OnePlus 13 ఇండియా లాంచ్ గురించి గత కొంతకాలంగా టీజింగ్ చేస్తున్న వన్ ప్లస్, ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లతో కంపెనీ టీజింగ్ చేస్తాను. ముందుగా చైనాలో విడుదలలైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెడుతోంది.
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ఇండియాలో 2025 జనవరి 7వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలర్ వేరియంట్స్ మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ వేగం పెంచింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, వన్ ప్లస్ 13 ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క అత్యంత వేగవంతమైన లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ సెట్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ ను అందిస్తుంది. దీనికి జతగా వన్ ప్లస్ AI సపోర్ట్ తో ఈ ఫోన్ చాలా స్మార్ట్ గా ఉంటుంది.
ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా ప్రకటించకపోయినా టీజింగ్ ఇమేజ్ లో ఈ మూడు కలర్ ఆప్షన్ ను చూపించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ ను విలాసవంతమైన మైక్రో ఫైబర్ వేగాన్ లెథర్ తో తీసుకు వస్తుంది.
Also Read: BSNL: 2 వేల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోన్, అంటే IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప వాటర్ రెసిస్టెంట్ తో తీసుకు వస్తుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ మరియు ఆకర్షణీయమైన డైజిన్ తో అందిస్తోంది. యీ ఏ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను కంపెనీ ఒక్క ఒకటిగా అనౌన్స్ చేస్తుందని చెబుతోంది.