OnePlus 13 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ.!
OnePlus 13 ఇండియా లాంచ్ గురించి గత కొంతకాలంగా టీజింగ్ చేస్తున్న వన్ ప్లస్
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ప్రకటించింది
ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెడుతోంది
OnePlus 13 ఇండియా లాంచ్ గురించి గత కొంతకాలంగా టీజింగ్ చేస్తున్న వన్ ప్లస్, ఎట్టకేలకు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లతో కంపెనీ టీజింగ్ చేస్తాను. ముందుగా చైనాలో విడుదలలైన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో కూడా అడుగుపెడుతోంది.
OnePlus 13: లాంచ్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ఇండియాలో 2025 జనవరి 7వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కలర్ వేరియంట్స్ మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ వేగం పెంచింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, వన్ ప్లస్ 13 ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
OnePlus 13 : ఫీచర్స్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క అత్యంత వేగవంతమైన లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ సెట్ 30 లక్షలకు పైగా AnTuTu స్కోర్ ను అందిస్తుంది. దీనికి జతగా వన్ ప్లస్ AI సపోర్ట్ తో ఈ ఫోన్ చాలా స్మార్ట్ గా ఉంటుంది.
ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా ప్రకటించకపోయినా టీజింగ్ ఇమేజ్ లో ఈ మూడు కలర్ ఆప్షన్ ను చూపించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ ను విలాసవంతమైన మైక్రో ఫైబర్ వేగాన్ లెథర్ తో తీసుకు వస్తుంది.
Also Read: BSNL: 2 వేల కంటే తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోన్, అంటే IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప వాటర్ రెసిస్టెంట్ తో తీసుకు వస్తుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ మరియు ఆకర్షణీయమైన డైజిన్ తో అందిస్తోంది. యీ ఏ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ ను కంపెనీ ఒక్క ఒకటిగా అనౌన్స్ చేస్తుందని చెబుతోంది.