OnePlus 13 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
OnePlus 13 ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది
ట్రిపుల్ రియర్ కెమెరా మరియు AI సపోర్ట్ తో తీసుకు వస్తోంది
OnePlus 13 టీజింగ్ క్యాంపైన్ ను కూడా మొదలు పెట్టింది
OnePlus 13 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ 13 4జి స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేయబడింది మరియు మంచి సేల్స్ కూడా సాధించింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ట్రిపుల్ రియర్ కెమెరా మరియు AI సపోర్ట్ తో తీసుకు వస్తోంది.
OnePlus 13 : లాంచ్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం కంపెనీ టీజింగ్ క్యాంపైన్ ను కూడా మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా మైక్రో సైట్ పేజి ని అందించింది. ఈ పేజీ నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా అందించింది.
OnePlus 13 : ఫీచర్స్
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ మరియు బ్లూ కలర్ వేరియంట్లలో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ ను వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ Oxygen OS 15 తో లాంచ్ చేస్తోంది.
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ AI ఇమేజింగ్ పవర్ తో వస్తుంది. అంటే, ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ ఉంటాయి. ఇందులో AI డీటెయిల్ బూస్ట్, AI అన్ బ్లర్, AI రిఫ్లెక్స్ ఎరేజర్ మరియు AI నోట్స్ వంటి చాలా AI ఫీచర్స్ ఉన్నట్లు వన్ ప్లస్ తెలిపింది.
Also Read: Vivo X200 Series ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!
వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ను 150W SuperVooc అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ ను క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ తో పాటు లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తుంది.