OnePlus 12R: వన్ ప్లస్ కొత్త ఫోన్ ధర మరియు Top-5 ఫీచర్లు తెలుసుకోండి.!

Updated on 24-Jan-2024
HIGHLIGHTS

వన్ ప్లస్ బ్రాండ్ ఇండియా లో కొత్త 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

వన్ ప్లస్ 12ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో డౌన్ గ్రేడ్ వెర్షన్ అవుతుంది

OnePlus 12R చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది

OnePlus 12R: వన్ ప్లస్ బ్రాండ్ ఇండియా లో కొత్త 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ సిరీస్ నుండి వన్ ప్లస్ 12 5జి మరియు వన్ ప్లస్ 12R 5జి లను లాంఛ్ చేసింది. వీటిలో వన్ ప్లస్ 12ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో డౌన్ గ్రేడ్ వెర్షన్ అవుతుంది. అయితే, చాలా ప్రీమియం ఫీచర్లను కలిగి వుంది. మరి ఈఫోనే ధరలో ఈ ఫోన్ కలిగివున్న స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం.

OnePlus 12R Price

వన్ ప్లస్ 12ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8 GB RAM + 128 GB)ను రూ. 39,999 రేటుతో ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ (16 GB RAM + 256 GB) ను రూ. 45,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరి 6వ తేదీ నుండి అమేజాన్ మరియు వన్ ప్లస్ అధికారిక సైట్ oneplus.in నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

వన్ ప్లస్ 12ఆర్ 5జి ప్రత్యేకతలు

Display

వన్ ప్లస్ 12ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ LTPO4.0 AMOLED ProXDR డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2780 x 1264 రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లేHDR10+ సపోర్ట్ తో Corning Gorilla Glass Victus 2 గ్లాస్ రక్షణతో మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి వుంది.

Performance

ఈ ఫోన్ ను Qualcomm Snapdragon 8 Gen 2 ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వన్ ప్లస్ లేటెస్ట్ OxygenOS 14 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB/16GB LPDDR5X RAM మరియు 128GB UFS3.1/256GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ తో చాలా వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది.

Also Read :OnePlus 12: 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లేతో వచ్చింది.!

Camera

ఈ ఫోన్ కెమేరా సిస్టం విషయాన్ని వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్ కెమేరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మ్యాక్రో కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టం వుంది. ఈ ఫోన్ కెమేరాతో 60/30 fps వద్ద 4K వీడియోలను షూట్ చెయ్యగలదు. అలాగే, 1080p వీడియోలను షూట్ చెయ్యగల 16MP సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది.

Battery

ఈ ఫోన్ లో 5,500 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ ను చాలా వేగంగా ఛార్జ్ చేయగల 100W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ ను కూడా అందించింది.

Audio & Video

ఈ ఫోన్ HDR10/HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ Dolby Atmos మరియు Noise cancellation సపోర్ట్ లను కలిగి వుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :