OnePlus 12: వన్ ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంఛ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ ను 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లే వంటి చాలా పవర్ ఫుల్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంఛ్ అయ్యింది. ఈ ఫోన్ గురించి ముందు నుండే భారీ అంచనాలను రేకెత్తించిన వన్ ప్లస్, అంచనాలకు తగినట్లుగానే వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకు వచ్చింది.
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 6.82 ఇంచ్ 3168×1440 (QHD+) 2K రిజల్యూషన్ కలిగిన 120Hz ProXDR డిస్ప్లేతో లాంఛ్ చెయ్యబడింది. ఈ డిస్ప్లే Corning Gorilla Glass Victus 2 రక్షణతో వస్తుంది మరియు HDR 10+, Dolby Vision సపోర్ట్ లతో వస్తుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ఫాస్ట్ ప్రొసెసర్ తో లాంఛ్ చెయ్యబడింది. అంతేకాదు, ఈ ఫోన్ 12GB/16GB LPDDR5X ఫాస్ట్ RAM మరియు 256GB/512GB UFS 4.0 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది.
ఈ ఫోన్ లో 50MP (Sony LYT-808) బిగ్ ప్రైమరీ సెన్సార్, 64MP OmniVision పెరిస్కోప్ టెలిఫోటో, 48MP Sony IMX581 ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో 24 fps వద్ద 8K video లను, 30/60 fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదని వన్ ప్లస్ తెలిపింది. ఇది 4th-Gen Hasselblad Camera సిస్టం మరియు Dolby Vision ఫీచర్ వంటి మరిన్ని కెమేరా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP Sony IMX615 సెల్ఫీ కెమేరాని 30fps వద్ద 4K వీడియోని రికార్డ్ చేయగల సపోర్ట్ తో అందించి నట్లు కూడా తెలిపింది.
ఈ ఫోన్ లో నోయిస్ క్యాన్సిలేషన్ మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 5,400 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని 100W SUPERVOOC వైర్డ్ మరియు 50W AIRVOOC వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.
Also Read: Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్.!
వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12 GB RAM + 256 GB) ను రూ. 64,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (16 GB RAM + 512 GB) ను రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 1,990 రూపాయలు చెల్లించి Pre-Book చేసుకునే అవకాశం ను అందించింది.
ఈ ఫోన్ పైన లాంఛ్ ఆఫర్లను కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ పైన రూ. 10,000 రూపాయల అడిషనల్ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను ప్రకటించింది. దీనితో పాటుగా ICICI మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది.