OnePlus 12: 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లేతో వచ్చింది.!

OnePlus 12: 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లేతో వచ్చింది.!
HIGHLIGHTS

వన్ ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంఛ్ చేసింది

వన్ ప్లస్ ఈ ఫోన్ 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లేతో లాంఛ్ అయ్యింది

ఈ ఫోన్ కెమేరాతో 24 fps వద్ద 8K video లను రికార్డ్ చేయవచ్చు

OnePlus 12: వన్ ప్లస్ తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లాంఛ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ ను 8K రికార్డ్ కెమేరా మరియు Dolby Vison డిస్ప్లే వంటి చాలా పవర్ ఫుల్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో లాంఛ్ అయ్యింది. ఈ ఫోన్ గురించి ముందు నుండే భారీ అంచనాలను రేకెత్తించిన వన్ ప్లస్, అంచనాలకు తగినట్లుగానే వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ ను తీసుకు వచ్చింది.

OnePlus 12 Specs

వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 6.82 ఇంచ్ 3168×1440 (QHD+) 2K రిజల్యూషన్ కలిగిన 120Hz ProXDR డిస్ప్లేతో లాంఛ్ చెయ్యబడింది. ఈ డిస్ప్లే Corning Gorilla Glass Victus 2 రక్షణతో వస్తుంది మరియు HDR 10+, Dolby Vision సపోర్ట్ లతో వస్తుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 ఫాస్ట్ ప్రొసెసర్ తో లాంఛ్ చెయ్యబడింది. అంతేకాదు, ఈ ఫోన్ 12GB/16GB LPDDR5X ఫాస్ట్ RAM మరియు 256GB/512GB UFS 4.0 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి వుంది.

OnePlus 12 with 8k record camera and Dolby vision display

ఈ ఫోన్ లో 50MP (Sony LYT-808) బిగ్ ప్రైమరీ సెన్సార్, 64MP OmniVision పెరిస్కోప్ టెలిఫోటో, 48MP Sony IMX581 ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరాతో 24 fps వద్ద 8K video లను, 30/60 fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదని వన్ ప్లస్ తెలిపింది. ఇది 4th-Gen Hasselblad Camera సిస్టం మరియు Dolby Vision ఫీచర్ వంటి మరిన్ని కెమేరా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP Sony IMX615 సెల్ఫీ కెమేరాని 30fps వద్ద 4K వీడియోని రికార్డ్ చేయగల సపోర్ట్ తో అందించి నట్లు కూడా తెలిపింది.

ఈ ఫోన్ లో నోయిస్ క్యాన్సిలేషన్ మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లను కలిగి వుంది. ఈ ఫోన్ లో 5,400 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీని 100W SUPERVOOC వైర్డ్ మరియు 50W AIRVOOC వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Also Read: Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్.!

వన్ ప్లస్ 12 5జి ధర

వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (12 GB RAM + 256 GB) ను రూ. 64,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (16 GB RAM + 512 GB) ను రూ. 69,999 ప్రైస్ ట్యాగ్ తో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 1,990 రూపాయలు చెల్లించి Pre-Book చేసుకునే అవకాశం ను అందించింది.

ఆఫర్స్:

ఈ ఫోన్ పైన లాంఛ్ ఆఫర్లను కూడా వన్ ప్లస్ అందించింది. ఈ ఫోన్ పైన రూ. 10,000 రూపాయల అడిషనల్ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను ప్రకటించింది. దీనితో పాటుగా ICICI మరియు OneCard క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo