OnePlus 12 Launched: 24GB ర్యామ్ మరియు 8K కెమేరాతో విడుదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్.!
వన్ ప్లస్ భారీ ఫీచర్లతో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది
వన్ ప్లస్ 12 లో యూజర్లను ఆకర్షించే చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ వివరాలు తెలుసుకోండి
OnePlus 12 Launched: ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ వన్ ప్లస్ భారీ ఫీచర్లతో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 24GB ర్యామ్ మరియు 8K కెమేరా వంటి భారీ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఈ వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 12 లో యూజర్లను ఆకర్షించే చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వన్ ప్లస్ సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ వివరాలు తెలుసుకోండి.
OnePlus 12 Launched
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లో విడుదలయ్యింది. వన్ ప్లస్ 12 బేసిక్ వేరియంట్ (12GB + 256GB) ను CNY 4,299 (సుమారు రూ. 50,500) ధరతో లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ యొక్క (16GB + 512GB) వేరియంట్ ను CNY 4,799 ధరతో, (16GB + 1TB) వేరియంట్ ను CNY 5,299 ధరతో లాంచ్ చేసింది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే, టాప్ ఎండ్ వేరియంట్ (24GB + 1TB) తో వస్తుంది మరియు దీని ధర CNY 5,799 (సుమారు రూ. 62,300).
Also Read : Mini Vacuum Cleaner: చవక ధరలో చిన్న వాక్యూమ్ క్లీనర్ తెచ్చిన Ambrane
వన్ ప్లస్ 12 ప్రత్యేకతలు
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ భారీ సెటప్ తోనే కంపెనీ అందించినట్లు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను 6.82 ఇంచ్ 3D AMOLED డిస్ప్లేని QHD+(3168×1440) రిజల్యూషన్ మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో అందించింది. ఈ డిస్ప్లే గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్నెస్ ను అందించ గలదు మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో Qualcomm యొక్క అత్యంత వేగవంతమైన లేటెస్ట్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 ని అందించింది. దీనికి తగినట్లుగా ఫోన్ ను మరింత వేగం చేయడానికి తగిన 24GB LPDDR5X వరకూ RAM మరియు 1TB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా జత చేసింది.
ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ + 64MP టెలిఫోటో + 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమేరా సిస్టమ్ వుంది. ఈ కెమేరాతో HEIF, JPEG, DNG ఫోటోలతో పాటుగా 60fps వద్ద 4K వీడియోలను మరియు 24fps వద్ద 8K వీడియోలను కూడా షూట్ చెయ్యగలదని వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన సెల్ఫీ కెమేరాతో కూడా 4K వీడియోలను షూట్ చెయ్యవచ్చని తెలిపింది.
ఈ ఫోన్ Wi-Fi 7, Bluetooth 5.4 మరియు మల్టీ ఫంక్షన్ NFC వంటి లేటెస్ట్ ఫీచర్లను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50W వైర్లెస్ ఛార్జ్ మరియు 10W వైర్లెస్ రివర్స్ ఛార్జ్ టెక్ సపోర్ట్ కలిగిన 5400mAh బ్యాటరీతో లాంచ్ చేసింది.
అయితే, ప్రసుతుఁనికి ఈ ఫోన్ ఇండియన్ వేరియంట్ లాంచ్ గురించి కంపెనీ ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు.