వన్ ప్లస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం సిద్దమవుతోంది. OnePlus 12 లాంచ్ కోసం డేట్ ఫిక్స్ చేసింది వన్ ప్లస్. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ప్రకటించింది చైనా మార్కెట్ లో లాంచ్ కోసం. ఈ ఫోన్ ను Snapdragon 8 Gen ప్రోసెసర్ తో లాంచ్ చేస్తోంది వన్ ప్లస్. Xiaomi 12 Series మరియు iQOO 12 Series కొత్త ఫోన్స్ తరువాత వన్ ప్లస్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లు ఈ ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్లుగా నిలుస్తాయి. ఈ చైనా మార్కెట్ లో లాంచ్ కాబోతున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ సంగతులేమిటో చూద్దామా.
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను వన్ ప్లస్ ను 10 వ వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంభందించి కొన్ని కీలకమైన వివరాలను కూడా వైబో ద్వారా వెల్లడించింది.
Also Read : Fire-Boltt Royale: 4GB మ్యూజిక్ స్టోరేజ్ తో New Smart Watch లాంచ్.!
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ లను స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఫ్లాగ్ షిప్ ప్రోసెసర్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ టీజర్ ద్వారా చెబుతోంది. ఈ ప్రోసెసర్ తో లాంచ్ అవుతున్న మూడవ స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 2K రిజల్యూషన్ డిస్ప్లే మరియు భారీ కెమేరా సెటప్ ను కలిగి ఉంటుందని నివేదికలు అంచనా వేసి చెబుతున్నాయి.
ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ప్రమియం స్మార్ట్ ఫోన్ లో Sony ప్రీమియం సెన్సార్ లను కలిగి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో, 50MP Sony IMX966 మెయిన్ సెన్సార్, 50MP Sony అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు 64MP సెన్సార్ కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.
అయితే, ఇవ్వని అంచనా స్పెక్స్ మాత్రమే అవుతాయి. కానీ, వన్ ప్లస్ 12 సిరీస్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉన్నది కాబట్టి కంపెనీ మరిన్ని స్పెక్స్ ను టీజింగ్ ద్వారా వెల్లడించే అవకాశం వుంది.
గమనిక: పోస్టర్ ఇమేజ్ కల్పితమైనది