OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ. వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను జనవరి 23వ తేదీ ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో వన్ ప్లస్ టీజింగ్ ను కూడా పెట్టింది. అమేజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అమేజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ అయ్యింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ప్రత్యేకతతో ఇండియన మార్కెట్ లో లాంచ్ కాబాతోందో తెలుసుకోండి.
వాస్తవానికి, డిసెంబర్ 5న వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ ను ఇదే నెలలో కంపెనీ అనౌన్స్ చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఈ ఫోన్ ను జనవరి 23 న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యోక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ ను కూడా స్టార్ట్ చేసింది.
Also Read : 1.5K Curved AMOLED డిస్ప్లేతో వస్తున్న Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్.!
వన్ ప్లస్ ఇప్పటి వరకు ఈ ఫోన్ యొక్క నాలుగు ఫీచర్లను టీజర్ పేజ్ ద్వారా బయట పెట్టింది. అందులో ఈ ఫోన్ డిజైన్, కెమేరా, ప్రోసెసర్ మరియు ఛార్జ్ టెక్ ఉన్నాయి.
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో తీసుకు వస్తున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. చైనాలో కూడా ఇదే ప్రోసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మార్వెల్ ఆఫ్ ఫోన్ నేచర్ వంటి గొప్ప డిజైన్ తో ఉన్నట్లు కంపెనీ టీజర్ చెబుతోంది. ఈ ఫోన్ లో అందించిన కెమేరాల గురించి ప్రత్యేకంగా చెబుతోంది కంపెనీ.
వన్ ప్లస్ 12 ఫోన్ ను 4th Gen Hasselblad మొబైల్ కెమేరాతో లాంచ్ చేస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ కెమేరా సెటప్ లో క్వాడ్ కెమేరా సెటప్ ను కూడా మనము టీజర్ ఇమేజ్ ద్వారా చూడవచ్చు. ఈ సెటప్ లో 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమేరా ఉన్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను 50W AIRVOOC ఛార్జ్ టెక్ తో తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది. అంటే, 50W ఎయిర్ ఊక్ వైర్ లెస్ చార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో అందించినట్లు క్లియర్ చేసింది.
రానున్న రోజుల్లో ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను కంపెనీ అందించే అవకాశం కూడా వుంటుంది.