OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!
HIGHLIGHTS

OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ

జనవరి 23వ తేదీ ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది

కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో వన్ ప్లస్ టీజింగ్ ను కూడా పెట్టింది

OnePlus 12 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ. వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను జనవరి 23వ తేదీ ఇండియన్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో వన్ ప్లస్ టీజింగ్ ను కూడా పెట్టింది. అమేజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అమేజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని క్లియర్ అయ్యింది. ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ప్రత్యేకతతో ఇండియన మార్కెట్ లో లాంచ్ కాబాతోందో తెలుసుకోండి.

OnePlus 12 Launch

వాస్తవానికి, డిసెంబర్ 5న వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్ లో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ ను ఇదే నెలలో కంపెనీ అనౌన్స్ చేస్తుందని నిపుణులు అంచనా వేశారు. కానీ, ఈ ఫోన్ ను జనవరి 23 న ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యోక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ ను కూడా స్టార్ట్ చేసింది.

Also Read : 1.5K Curved AMOLED డిస్ప్లేతో వస్తున్న Redmi Note 13 Pro+ స్మార్ట్ ఫోన్.!

వన్ ప్లస్ 12 టీజ్డ్ స్పెక్స్

వన్ ప్లస్ ఇప్పటి వరకు ఈ ఫోన్ యొక్క నాలుగు ఫీచర్లను టీజర్ పేజ్ ద్వారా బయట పెట్టింది. అందులో ఈ ఫోన్ డిజైన్, కెమేరా, ప్రోసెసర్ మరియు ఛార్జ్ టెక్ ఉన్నాయి.

వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో తీసుకు వస్తున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. చైనాలో కూడా ఇదే ప్రోసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మార్వెల్ ఆఫ్ ఫోన్ నేచర్ వంటి గొప్ప డిజైన్ తో ఉన్నట్లు కంపెనీ టీజర్ చెబుతోంది. ఈ ఫోన్ లో అందించిన కెమేరాల గురించి ప్రత్యేకంగా చెబుతోంది కంపెనీ.

OnePlus 12 teased specs and features
వన్ ప్లస్ 12 టీజ్డ్ స్పెక్స్

వన్ ప్లస్ 12 ఫోన్ ను 4th Gen Hasselblad మొబైల్ కెమేరాతో లాంచ్ చేస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ కెమేరా సెటప్ లో క్వాడ్ కెమేరా సెటప్ ను కూడా మనము టీజర్ ఇమేజ్ ద్వారా చూడవచ్చు. ఈ సెటప్ లో 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమేరా ఉన్నట్లు వన్ ప్లస్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను 50W AIRVOOC ఛార్జ్ టెక్ తో తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది. అంటే, 50W ఎయిర్ ఊక్ వైర్ లెస్ చార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో అందించినట్లు క్లియర్ చేసింది.

రానున్న రోజుల్లో ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను కంపెనీ అందించే అవకాశం కూడా వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo