వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ OnePlus 12 యొక్క కొత్త వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్ ను తీసుకు వస్తున్నట్లు మరియు ఈ ఫోన్ ను జూన్ 6న విడుదల చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు మరియు కొత్త కలర్ వేరియంట్ విశేషాలు తెలుసుకుందాం.
వన్ ప్లస్ 12 యొక్క కొత్త కలర్ వేరియంట్ గురించి కంపెనీ వివరాలు అందించింది. జూన్ 6 వ తేదీన ఈ కొత్త వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు కూడా తెలిపింది. వన్ ప్లస్ 12 గ్లేషియల్ వైట్ కలర్ వేరియంట్ ను తీసుకు వస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే సిల్కీ బ్లాక్ మరియు ఫ్లోవీ ఏమిరాల్డ్ కలర్ లలో లభిస్తున్న వన్ ప్లస్ 12, జూన్ 6వ తేదీ నుంచి గ్లేషియల్ వైట్ కలర్ లో కూడా లభిస్తుంది.
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ ప్రస్తుతం రూ. 64,999 రూపాయలుగా వుంది. అయితే, కొత్త వేరియంట్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ ను కూడా ఇదే ధరకు లిస్ట్ చేసే అవకాశం ఉండవచ్చు.
Also Read: Motorola G04s: చవక ధరలో 50MP కెమెరాతో లాంచ్ చేసిన మోటోరోలా.!
వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 16GB LPDDR5X RAM మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 2K రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన 120 Hz ProXDR LTPO డిస్ప్లే వుంది మరియు ఇది గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డిస్ప్లే HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ లో 50MP సోనీ LYT-808 మెయిన్, 64MP పెరిస్కోప్ మరియు 48MP అల్ట్రా వైడ్ సెన్సార్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ DSLR వంటి పోర్ట్రైట్ ఫోటలను అందించగల సత్తా కలిగి వుంది మరియు 3X ఆప్టికల్ లేదా 120X డిజిటల్ జూమ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 5400mAh బ్యాటరీ వుంది మరియు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.