OnePlus 12 5G Series Launch: రేపు విడుదల కానున్న వన్ ప్లస్ ఫోన్ల ప్రైస్ & స్పెక్స్ లీక్.!
చాలా కాలంగా వన్ ప్లస్ టీజింగ్ చేస్తున్న వన్ ప్లస్ 12 లాంఛ్ రేపు జరగనున్నది
OnePlus 12 5G Series Launch యొక్క స్పెక్స్ మరియు ప్రైస్ ఆన్లైన్ లో లీకయ్యాయి
వన్ ప్లస్ 12 సిరీస్ లీక్డ్ ప్రైస్ వివరాలను వన్ ప్లస్ క్లబ్ అకౌంట్ నుండి ట్వీట్ చేసింది
OnePlus 12 5G Series Launch: చాలా కాలంగా వన్ ప్లస్ టీజింగ్ చేస్తున్న వన్ ప్లస్ 12 లాంఛ్ రేపు జరగనున్నది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందుగానే ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ప్రైస్ ఆన్లైన్ లో లీకయ్యాయి. లీకైన వివరాలను చూస్తుంటే, ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప డిజైన్, స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగి మిడ్ రేంజ్ ధరలో లాంచ్ కాబోతున్నట్లు కనిపిస్తోంది.
OnePlus 12 5G Series Launch
వన్ పలు 12 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో రేపు విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ సేల్ పార్ట్నర్ అయిన అమేజాన్ ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో చాలా కాలం నుంచి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజ్ నుండి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ స్పెక్స్ మరియు ఫీచర్లను అందించింది. అయితే, వన్ ప్లస్ క్లబ్ ట్విట్టర్ అకౌంట్ నుండి వన్ ప్లస్ 12 సిరీస్ ఫోన్స్ లీక్డ్ ప్రైస్ వివరాలతో టీజింగ్ చేస్తోంది.
వన్ ప్లస్ 12 సిరీస్ లీక్డ్ ప్రైస్
వన్ ప్లస్ 12 సిరీస్ లీక్డ్ ప్రైస్ వివరాలను వన్ ప్లస్ క్లబ్ అకౌంట్ నుండి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రకారం వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్స్ లో వన్ ప్లస్ 12 యొక్క బేసిక్ వేరియంట్ (12+256GB) ధర రూ. 55,999 గా మరియ 16+512GB హై ఎండ్ వేరియంట్ ధర రూ. 61,999 గా లీక్స్టర్స్ సూచిస్తున్నట్లు చెబుతోంది.
అలాగే, వన్ ప్లస్ 12ఆర్ ధర వివరాలను కూడా ఈ ట్వీట్ నుండి సూచించింది. ఇందులో వన్ ప్లస్ 12ఆర్ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8+128GB) రూ. 39,999 గా మరియు (8+128GB) ధర రూ. 39,999 తో ఉండవచ్చని సూచిస్తున్నారని తెలిపింది. ఇది మాత్రమే కాదు వన్ ప్లస్ బడ్స్ 3 రూ. 10,499 కావచ్చని తెలిపింది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
Also Read : Jio ధమాకా: 12 OTTలు మరియు డేటా కేవలం కేవలం రూ. 148 కే అందుకోండి.!
వన్ ప్లస్ 12 సిరీస్ టీజ్డ్ స్పెక్స్
వన్ ప్లస్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లలో వన్ ప్లస్ 12 5జి స్మార్ట్ ఫోన్ డిజైన్, ప్రోసెసర్ మరియు కెమేరా వివరాలను టీజింగ్ ద్వారా అందించింది. వన్ ప్లస్ 12 5జి ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రోసెసర్ తో పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 4th-Gen Hasselblad Camera ని అందించినట్లు కూడా వన్ ప్లస్ తెలిపింది. ఈ ఫోన్ లో వన్ ప్లస్ 50W AIRVOOC అల్ట్రా ఫాస్ట్ చరింగ్ సపోర్ట్ ఉన్నట్లు కూడా తెలిపింది.
ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే , ఈ ఫోన్ ను మర్వెల్ ఆఫ్ నేచర్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో తీసుకు వచ్చినట్లు వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది. అంటే , ప్రకృతిలోని అందమైన వివరాల మిళితంగా ఈ ఫోన్ ను డిజైన్ చేసినట్లు చెబుతోంది.
వన్ ప్లస్ 12 సిరీస్ రేపు ఇండియాలో విడుదల అవుతుంది కాబట్టి ఈ లీక్డ్ ప్రైస్ ఎంత వరకూ నిజమో తెలుస్తుంది.