OnePlus 11R 5G: సేల్ కి అందుబాటులోకి వచ్చిన వన్ ప్లస్ బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్.!

Updated on 28-Feb-2023
HIGHLIGHTS

OnePlus 11R 5G సేల్ కి అందుబాటులోకి వచ్చింది

వన్ ప్లస్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ OnePlus 11R 5G

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి

వన్ ప్లస్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ OnePlus 11R 5G సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Super Fluid AMOLED డిస్ప్లే, 8+ Gen 1 ప్రోసెసర్ మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో సహా చాలా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.       

OnePlus 11R 5G: ధర మరియు ఆఫర్లు

వన్‌ప్లస్ 11 5G యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.39,999. OnePlus 11 5G  యొక్క హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.44,999.

వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు amazon.in, oneplus.in మరియు ఆఫ్ లైన్ స్టోర్‌ల నుండి అందుబాటులో వుంది. ICICI మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన No Cost EMI మరియు Low Cost EMI ఆఫర్లను కూడా కంపెనీ అందించింది.    

OnePlus 11 5G: స్పెక్స్

ఈ వన్‌ప్లస్ 11R 5G పెద్ద 6.74 -ఇంచ్ (2772 X 1240) రిజల్యూషన్ గల Super Fluid AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది HDR10+ సపోర్ట్ చేసే 10-బిట్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8+ Gen 1 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ 13.0 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది.

కెమెరాల పరంగా, వన్‌ప్లస్ 11R 5G వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX890 సెన్సార్ ని OIS సపోర్ట్ మరియు f/1.88 అపర్చర్ తో అందించింది.  దీనికి జతగా 2MP మ్యాక్రో కెమెరాని మరియు 8MP అల్ట్రా వైడ్ కెమేరాని జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.

వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 100W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :