OnePlus 11 5G: భారీ ఆఫర్లతో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్.!

OnePlus 11 5G: భారీ ఆఫర్లతో మొదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ సేల్.!
HIGHLIGHTS

OnePlus 11 5G సేల్ కి అందుబాటులోకి వచ్చింది

బ్యాంక్ మరియు భారీ ఎక్స్ చేంజ్ అఫర్ లను కూడా కంపెనీ జతచేసింది

వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది

వన్ ప్లస్ ఇండియాలో లేటెస్ట్ గా ప్రకటించిన స్మార్ట్ ఫోన్ OnePlus 11 5G సేల్ కి అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లు మరియు ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అఫర్ లో భాగంగా బ్యాంక్ మరియు భారీ ఎక్స్ చేంజ్ అఫర్ లను కూడా కంపెనీ జతచేసింది. సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు మరియు స్పెక్స్ వివరాల పైన ఒక లుక్కేయండి. 

OnePlus 11 5G: ధర మరియు ఆఫర్లు 

వన్‌ప్లస్ 11 5G యొక్క బేస్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.56,999. OnePlus 11 5G  యొక్క హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర రూ.61,999.

వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ amazon.in మరియు oneplus.in స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ICICI మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, Oneplus మరియు iOS 4G డివైజెస్ ఎక్స్ చేంజ్ పైన 6,000 రూపాయల అదనపు బోనస్ కూడా అఫర్ చేస్తోంది.       

OnePlus 11 5G: ప్రత్యేకతలు

ఈ వన్‌ప్లస్ 11 5G పెద్ద 6.7 -ఇంచ్ QHD + రిజల్యూషన్ గల Super Fluid AMOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది Dolby Vision HDR సపోర్ట్ చేసే 10-బిట్ ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 2 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ కి జతగా 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 4.0 స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది ఆక్సిజన్ 13.0 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగంలో, వన్‌ప్లస్ 11 5G వెనుక భాగంలో 3rd Gen Hasselblad ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో ప్రాధమిక కెమెరా 50MP SonyIMX890 సెన్సార్ ని OIS సపోర్ట్ మరియు f/1.88 అపర్చర్ తో అందించింది.  దీనికి జతగా 32MP sony టెలీ ఫోటో కెమెరాని మరియు  48MP అల్ట్రా వైడ్ కెమేరాని జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరాని అందించింది.

వన్‌ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 100W సూపర్ VOOC ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo