వన్ ప్లస్ 5 మరియు 5టీ లో ఆక్సిజన్ ఒఎస్ 5.1.4 ని అందుకోండి 2018

వన్ ప్లస్ 5 మరియు 5టీ లో ఆక్సిజన్ ఒఎస్ 5.1.4 ని అందుకోండి 2018
HIGHLIGHTS

క్రొత్త అప్డేట్ వలన స్లీప్ స్టెబిలిటీ ఆప్టిమైజేషన్,సెక్యూరిటీ అప్డేట్ లను ఫోన్ కి సమకూర్చే వీలుంది . కానీ ప్రాజెక్టు ట్రెబెల్ పొందే వీలులేదు.

ఒక వేళ మీరు మీ వన్ ప్లస్  5 మరియు 5T లలో ప్రాజెక్ట్ ట్రెబెల్ని పొందడం కోసం గనుక మీరు ఎదురు చూస్తునట్లయితే , మీరు ఇంకా కొంత కలం వేచి ఉండవలసి ఉంటుంది . మీ ఫోన్ లో బీటా అందుబాటులో ఉన్నప్పటికీ , వన్ ప్లస్ 5 మరియు 5T లలో ప్రోజక్ట్ ట్రెబెల్ యొక్క చివరి అప్డేట్ ఇంకా విడుదల అవలేదు కాబట్టి వీటి వినియోగదారులు ఇంకా కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది . క్రొత్త అప్డేట్ ఆక్సిజెన్ 5.1.4 తో ఫిక్సస్ మరియు ఫీచర్ల లోని ఇబందులను నియంత్రణలోకి తెస్తుంది. దీనితో పాటుగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ 2018 కూడా వస్తుంది. స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్ లో వచ్చిన అదనపు పనితనం ద్వారా , ఫోటో క్లారిటీ లో మెరుగుదల , గ్రూప్ మెసేజింగ్ , మరియు సాధారణ బగ్ ఫిక్స్ లో మెరుగుదల ఉంటుంది .

ఈ అప్డేట్ కోసం మీరు ,మీ వన్ ప్లస్ 5 మరియు 5T యొక్క సిస్టమ్ సెట్టింగులకు వెళ్లి అప్డేట్స్ కోసం తనిఖీ చేయడం ద్వారా అప్డేట్ కోసం తనిఖీ చేయవచ్చు. ప్రాజెక్ట్ టాంగో యొక్క ఒక బీటా నిర్మాణం వీటిలో(వన్ ప్లస్ 5 మరియు 5T) అందుబాటులో ఉన్నప్పటికీ, కూడా ఇది ఈ అప్డేట్ లో భాగం కాదు.

 జూలై నెలలో తిరిగి,  వన్ ప్లస్  ఈ రెండు మోడల్స్ అయినా  వన్ ప్లస్ 5 మరియు 5T కోసం ఆక్సిజన్ OS ఓపెన్ బీటా వెర్షన్ 13 మరియు 11 ను వరుసగా ప్రకటించింది. ఓపెన్ బీటా యొక్క హైలైట్ ఈ  పరికరానికి ప్రాజెక్ట్ ట్రెబుల్ ని పొందేలా  మద్దతును అందిస్తుంది.

గూగుల్ గత సంవత్సరం లో ఆండ్రాయిడ్ ఒరేయో కన్నా ముందుగానే ప్రోజక్ట్ ట్రెబుల్ ని ప్రకటించింది. విక్రయదారుడి  విభజన నుండి సిస్టమ్ విభజనను వేరు చేసి పరికరానికి సాఫ్ట్ వేర్ అప్డేట్ ను అందచేయడం వేగవంతమైన పద్ధతి.

ఇది విక్రయదారు విభజనను ప్రభావితం చేయకుండానే ఆండ్రాయిడ్  వెర్షన్ను అప్డేట్ చేయడానికి  విక్రేత (OEM) కోడ్ ను ప్రభావితం చేయకుండానే దీనిని ఉంచడం ద్వారా ఇది జరుగుతుంది.

వన్ ప్లస్ ముందుగా చెప్పినట్లుగానే  ప్రాజెక్ట్ ట్రెబుల్ కు ప్రభావితం చేయదని , వన్ ప్లస్ 5 / 5T మరియు వన్ ప్లస్ 3/3టీ లను ముందుగానే ఆండ్రాయిడ్ నౌగాట్ తో అందించారు ,ఏవిధమైన సిస్టమ్ విభజన అవసరం లేకుండానే . ఈ విభజన OTA  ద్వారా అప్డేట్ సాదించవచ్చు,  అయితే ఈ పద్ధతి ద్వారా డేటాను కోల్పోయే అవకాశం ఉన్నందున వన్ ప్లస్ ఈ పద్దతిని ఎంచుకోలేదు. వన్ ప్లస్  తన వినియోగదారుల పిటిషన్ లను విన్నట్లుగా కనిపిస్తోంది, ఎందుకంటె ఇప్పుడు ప్రాజెక్ట్ ట్రెబెల్ ని  వన్ ప్లస్ 5/5టీ  కు వర్తించేయడానికి ప్రయత్నిస్తోంది.అయితే , వన్ ప్లస్ 3/3టీ కోసం కూడా ఇదేమార్పులు చేస్తుందనే  దానికి ఏవిధమైన ఆధారంలేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo