షావోమి 48MP కెమరాతో ఒక రెడ్మి ఫోన్ను జనవరి 10న విడుదలచేయవచ్చు
గత నెల, షావోమి 48MP వెనుక కెమెరా మరియు ఒక పంచ్ హోల్ డిస్ప్లేతో, ఒక Redmi ఫోన్ ప్రారంభించటానికి చూస్తున్నట్లు ఒక నివేదికలో పేర్కొన్నా
ముఖ్యాంశాలు:
1. షావోమి 48MP కెమెరాతో ఒక రెడ్మి ఫోన్ను విడుదలచేయనున్నది
2. ఇది రెడ్మి ప్రో 2 లేదా రెడ్మి 7 కావచ్చు
3. Redmi ఒక స్వతంత్ర బ్రాండ్ కూడా కావచ్చు
గత నెల, షావోమి 48MP వెనుక కెమెరా మరియు ఒక పంచ్ హోల్ డిస్ప్లేతో, ఒక Redmi ఫోన్ ప్రారంభించటానికి చూస్తున్నట్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇక జనవరి నెలకు వస్తే , ఈ చైనీస్ కంపెనీ ఇప్పుడు ఈ ప్రకటనను నిజం చేయనున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే, జనవరి 10 వ తేదీన ఒక రెడ్మి ఫాంను విడుదలచేయనున్నట్లు ధృవీకరించింది. తేదీ తప్ప, షావోమి యొక్క రాబోయే పరికరాన్ని గురించి ఏ ఇతర సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఈ ఫోన్ షావోమి రెడ్మి ప్రో 2 లేదా రెడ్మి 7 గా ఉంటుందని వివాదాస్పదమైన నివేదికలు చెబుతున్నాయి.
అయితే, "రెడ్మి" అని వ్రాసిన చిత్రంతో, ప్రయోగ తేదీ మరియు సమయముతో కలిసి ఉన్న ఒక చిత్రంతో ఇపుడు టీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో రెడ్మి పేరు యొక్క నీడలో ఒక పైపు 48 అని వుంది,అంటే పరికరంలో 48MP కెమెరా సెటప్ను సూచిస్తుంది. మునుపటి నివేదిక ప్రకారం, 48MP సెన్సార్ ఫోన్ వెనుక ప్యానెల్లో ట్రిపుల్ కెమెరా సెటప్పులో భాగంగా ఉంటుందిని నివేదించారు. ఇది కాకుండా, ఈ Redmi ఫోన్లో సెల్ఫీ కెమెరాని పొందుపరచడానికి డిస్ప్లేలో ఒక పంచ్ హోల్ ఉంటుంది. కేవలం శామ్సంగ్ గెలాక్సీ A8 మరియు హనర్ వ్యూ 20 వంటివి, మరియు ఇప్పుడు ఈ Redmi స్మార్ట్ ఫోన్ ఒక LCD ప్యానెల్ కలిగి ఉంటుందిని అంచనావేస్తున్నారు.
ఆసక్తికరంగా, ఈ కంపెనీ చేత చైనీస్ వైబో లో చేయబడిన పోస్ట్ యొక్క Google అనువాదం, "కొత్త స్వతంత్ర బ్రాండ్, రెడ్మి కాన్ఫరెన్సు. జనవరి 10, ఓపెన్ ది డోర్! " అని చూపిస్తోంది. అయితే, మేము ఈ అభివృద్ధిని పూర్తిగా నిర్ధారించలేము కాబట్టి లైట్ గా తీసుకోవాలి. చాలా వరకు Xiaomi Redmi ప్రో 2 మరియు Redmi 7, రెండు ఫోన్లకి సంబంధించి చాల రూమర్లు మరియు లీక్స్, కూడా వచ్చాయి. ఆరోపణలు అందుకున్న షావోమి రెడ్మి 7 సిరీస్, 3C సర్టిఫికేషన్ పొందినట్లు మరియు TENAA జాబితా చేయబడ్డాయి. Redmi ప్రో 2 గురించి లీకులు మరియు ఆరోపణలు రెండు వారాల క్రితం బహిర్గతమైంది.
షావోమి రెడ్మి 7 సిరీస్
M1901F7E, M1901F7T మరియు M1901F7C – మూడు మోడళ్లకు 3C సర్టిఫికేషన్ పొందింది మరియు ఒక 10W ఛార్జరుతో వెబ్సైట్లో జాబితా చేయబడిందని ఒక నివేదిక పేర్కొంది. ఈ గుర్తించబడని నమూనాలు Redmi 7, Redmi 7A మరియు Redmi 7 ప్రో గా అంచనావేయబడ్డాయి. ఈ మోడల్ సంఖ్య M1901F9T తో ఉన్న ఇంకొక పరికరాన్ని TENAA లో ఒక 5.8 అంగుళాల డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ -ఆకారపు నోచ్ తో ఒక స్మార్ట్ ఫోన్నుచూపించింది.అయితే, ఇది క్రిస్మస్ ముందు చైనాలో ప్రారంభించబడిన Xiaomi Mi Play అని తెలుస్తోంది.
షావోమి రెడ్మి ప్రో 2
డిసెంబరులో, షావోమి అధ్యక్షుడు లిన్ బిన్, 48MP కెమెరాతో ఒక ఫోన్ యొక్క చిత్రంను పంచుకున్నారు. ఈ ఫోన్ రెడ్మి ప్రో 2 అని మరియు స్నాప్ డ్రాగన్ 675 చిప్సెట్ ద్వారా ఆధారితమైనదని వచ్చిన వదంతులు తెలిపాయి. ఈ స్నాప్ డ్రాగన్ 675 అక్టోబరు నెలలో ప్రకటించబడింది మరియు ఇది శక్తివంతమైన మధ్యస్థాయి మొబైల్ ప్లాట్ఫారంగా ఉండనున్నట్లు పరిగణించబడుతుంది. అయినప్పటికీ, ముఖ్యంగా Snapdragon 675 48MP చిత్రాలను సంగ్రహించడానికి మద్దతు ఇస్తుంది.