Honor 8C బడ్జెట్ ధరలో ఒక 6.26 అంగులా నోచ్ డిస్ప్లే , స్నాప్ డ్రాగన్ 632 మరియు 4000mAh బ్యాటరీతో వస్తుంది

Updated on 13-Oct-2018
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ 19:9 డిస్ప్లే మరియు గ్రేడియంట్ కలర్స్ తో వస్తుంది

హువాయ్ యొక్క ఉప బ్రాండ్ అయిన హానర్,  చైనాలో తన కొత్త ఫోన్ను విడుదల చేసింది అదే  Honor 8C . ఇది హానర్ 7C ఫోన్ యొక్క వారసునిగా  మార్కెట్లోకి రానుంది.ఈ  హానర్ 8C, సరికొత్త క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 చిప్సెట్ తో వస్తుంది. ఇది అరోరా బ్లూ, ప్లాటినం గోల్డ్, నెబ్యులా పర్పుల్ మరియు మిడ్ నైట్ బ్లాక్ రంగు ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త హానర్ 8C రెండు రకాల్లో అందుబాటులో ఉంటుంది అవి – 4GB ర్యామ్ మరియు 32GB అంతర్గత స్టోరేజి,  దీని ధర చైనాలో CNY 1,099 (సుమారు Rs. 11,800). ఇంకా,  4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజి,  దీని ధర చైనాలో CNY 1,399 (సుమారు Rs. 11,800)  ఇవి చైనాలో క్రమబద్ధీకరించడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ అక్టోబర్ 16, 2018 నుండి దాని అమ్మకాలు చైనాలో ప్రారంభమవుతాయి.

ఈ స్మార్ట్ ఫోన్,  720×1520 పిక్సెల్  అందించగల ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది.  ఇది మీకు 86.6% స్క్రీన్ టూ  బాడీ రేషియో మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియో ఇస్తుంది. పైన చెప్పినట్లుగా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 632 చిప్సెట్తో 4GB RAM 32 / 64GB స్టోరేజి  కలిగి ఉంది.

కెమేరా విషయానికి వస్తే,  13MP సెన్సార్ (f / 1.8 అపేర్చేర్) మరియు 2MP సెన్సార్ ( f / 2.4 అపేర్చేర్) గల డ్యూయల్ – వెనుక కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది  LED ఫ్లాష్ తో పాటుగా.  ముందు,  8MP సెన్సార్ (f / 2.0 అపేర్చేర్) LED ఫ్లాష్ ని కలిగి ఉంటుంది,  ఇది  సెల్ఫి మరియు వీడియో కాలింగ్ కి అనువైనది.  మీకు ఫ్రంట్ కెమెరా AI కి మద్దతు ఇస్తుంది, తద్వారా మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ ను ఉపయోగించవచ్చు. చివరగా, ఈ స్మార్ట్ఫోన్లో Android 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం EMUI 8.2 ఉంటుంది. ఇందులో మీరు 4000 mAh బ్యాటరీని కలిగి ఉంటారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :