దుబాయ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ కంపెని, Obi నుండి కొత్తగా రెండు మోడల్స్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యాయి. దీనిని obi వరల్డ్ ఫోన్ అని పిలుస్తుంది కంపెని. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లో లాంచ్ అయ్యి 2017 కు అల్లా 70 దేశాలలో వ్యాపిస్తుంది మార్కెట్.
ఒకదాని పేరు obi వరల్డ్ ఫోన్ SF1, రెండవ దాని పేరు SJ 1.5. వీటి ప్రత్యేకతలు ఏంటంటే తక్కువ ధరలు లభ్యం అవటం. స్టార్టింగ్ మోడల్ ప్రైస్ 8,500 రూ. హై ఎండ్ మోడల్ ధర 16,500 రూ.
obi వరల్డ్ ఫోన్ SF 1 స్పెసిఫికేషన్స్ – 5in 1080P JDI డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb అదనపు స్టోరేజ్ సదుపాయం, 4G FDD అండ్ TDD బ్యాండ్స్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్.
13MP సోనీ IMX214 సెన్సార్ అండ్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ సిస్టం రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 3000 mah బ్యాటరీ. ఈ మోడల్ 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ – 3gb ర్యామ్ వేరియంట్ లో కూడా రిలీజ్ అవుతుంది.
దాదాపుగా ఇదే స్పెక్స్ తో కంపెని 3 3G అండ్ 4G వేరియంట్స్ తో SF1 అండ్ SJ 1.5 స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేయనుంది. మొదటిగా ఇండోనేషియా, వియత్నాం, UAE అండ్ థాయ్లాండ్, సౌదీఅరేబియా దేశాలలో available అవుతుంది. త్వరలోనే ఇండియాకు కూడా రానుంది.
అక్టోబర్ నెలలో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. కాని ఇండియన్ ప్రైస్ టాగ్స్ ఇంకా వెల్లడికాలేదు. ఇప్పటికే ఈ బ్రాండ్ నుండి గతంలో ఫోన్స్ వచ్చాయి కాని ఈ సారి డిజైన్ పరంగా ఎక్కువ శ్రద్ద పెట్టి తక్కువ ప్రైసేస్ తో లాంచ్ అవుతుంది.