Obi వరల్డ్ ఫోన్ SF1 ఇండియా లాంచ్ ఈ నెలలో: కన్ఫర్మ్

Updated on 20-Nov-2015
HIGHLIGHTS

ఇది ఆపిల్ మాజీ ఉద్యోగి తయారు చేసిన ఫోన్

ఆపిల్ మాజీ ఉద్యోగి జాన్ తయారు చేసిన కొత్త ఫోన్, Obi వరల్డ్ ఫోన్ SF1. ఈ విషయం గతంలో తెలిపాము. ఇప్పుడు ఇది ఇండియాలో లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.

ఈ నెలలోనే SF1 లాంచ్ అవనుంది ఇండియాలో. దీనితో పాటు మరొక మోడల్, వరల్డ్ ఫోన్ SJ 1.5ఆల్రెడీ దుబాయ్ అండ్ వియత్నాం దేశాలలో రిలీజ్ అయ్యాయి.

స్పెక్స్ – 4G, డ్యూయల్ సిమ్, 5in JDI In- cell IPS ఫుల్ HD 1080 x 1920 పిక్సెల్స్ 443PPi గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.0.2, 64 బిట్ ఆక్టో కోర్ 1.5GHz స్నాప్ డ్రాగన్ MS8939 615 SoC.

2gb అండ్ 3gb ర్యామ్, అడ్రెనో 405 GPU, 16 అండ్ 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, 64gb sd కార్డ్ సపోర్ట్, 13MP అండ్ 5MP కెమేరాస్. రెండింటికీ led ఫ్లాష్ ఉంది. 

డ్యూయల్ మైక్, డాల్బీ డిజిటల్ ఆడియో 7.1 సరౌండ్, క్విక్ చార్జ్ 1.0, 3000 mah బ్యాటరీ తో 147 గ్రా బరువు కలిగి ఉంది. దీని 2gb అండ్ 16gb వేరియంట్ ప్రైస్ – 13,000 రూ. 3gb ర్యామ్ అండ్ 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ ప్రైస్ – 16,500 రూ.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :