51 సెకన్లలో ఏకంగా 10 లక్షల సేల్స్ కంప్లీట్ చేసిన Nubia Z17

51 సెకన్లలో ఏకంగా  10 లక్షల సేల్స్ కంప్లీట్  చేసిన Nubia Z17
HIGHLIGHTS

ఈ డివైస్ ప్రస్తుతం చైనా లో లాంచ్ చేయబడింది

Nubia బ్రాండ్ నుంచి జూన్ 1న చైనా మార్కెట్లో లాంచ్ అయిన 8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ Nubia Z17 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫోన్ కు సంబంధించి మంగళవారం జరిగిన మొదటి ఫ్లాష్ సేల్‌ లో భాగంగా 51 సెకన్లలో 10 లక్షల Nubia Z17 యూనిట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది

ఈ డివైస్  ప్రస్తుతం చైనా లో లాంచ్ చేయబడింది  .  భారత్ లో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా  తెలియలేదు . 
మార్కెట్ లోని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్  అన్నిటికీ ఇది గట్టి పోటీ ఇవ్వనుందట .  ఇక దీనిలోని స్పెషల్  అట్రాక్షన్ ముఖ్యంగా ఇది వాటర్ ఫ్రూప్ సిస్టంతో రాబోతుందని సమాచారం. ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది. 
ఆర్టిపీషయల్ ఇంటిలిజెన్స్ తో పాటు 23 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉండటం. 

ఇక  దీని స్పెక్స్ కనుక  మనం గమనిస్తే 

5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ  2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే తో రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్  ఆక్టాకోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది.  6/8 జిబి  RAM  మరియు   64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఇది కలిగి వుంది  . 
23మెగాపిక్సల్ డ్యుయల్ రేర్  కెమెరాలు ఉంటాయి.  16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కలిగి వుంది. సిల్వర్, గోల్డ్ కలర్స్ లో తో పాటు బ్లూ కలర్స్ లో కూడా ఫోన్ లభ్యమవుతుందని సమాచారం. 4GVOLTE  డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్  వంటివాటిని కనెక్టివిటీ ఆప్షన్స్ గా ఇచ్చారు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo