షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ఇండియా వేరియంట్, కలర్స్ లీక్

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ఇండియా వేరియంట్, కలర్స్ లీక్
HIGHLIGHTS

ఒక నివేదిక ప్రకారం, షావోమి తన రెడ్మి నోట్ 6 ప్రో రెండు వేరియంట్లలో ఎంచుకోగల రంగులతో విడుదల చేయవచ్చు.

షావోమి యొక్క రెడ్మి నోట్ 6 ప్రో ని త్వరలోనే ఇండియాలో విడుదల చేయవచ్చని, కొన్నిలీకైన నివేదికలు చెబుతున్నాయి. ఈ లీకుల ప్రకారంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఎంచుకోగల రెండు వేరియంట్లు మరియు నాలుగు రంగులతో ఉండవచ్చని అంచనా. ఈ హ్యాండ్సెట్ గత  థాయిలాండ్ లో మూడు రంగులలో ఎంచుకోగల ఒక వేరియంట్ ఆవిష్కరించబడింది. దీనిలోని  హార్డ్వేర్ దాదాపుగా రెడ్మి నోట్ 5 ప్రో వలెనే వున్నా, డిస్ప్లే మరియు డిజైన్ లో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు వున్నాయి.

మై స్మార్ట్ ప్రైస్ తెలిపిన ఒక నివేదిక ప్రకారం, ఈ రెడ్మి నోట్ 6 ప్రో రెండు వేరియంట్లలో విడుదల కావచ్చని అంచనా అవి – 4GB RAM + 64GB స్టోరేజి మరియు 6GB RAM + 64GB మరియు వీటి స్టోరేజిని 256GB వరకు విస్తరించవచ్చు. ఇండియాలో, వీటిని నాలుగు రంగులలో విడుదల చేయవచ్చుఅవి : రోజ్ గోల్డ్, బ్లాక్, బ్లూ మరియు రెడ్. థాయిలాండ్ లో మాత్రం, నలుపు , బ్లూ, రోజ్ గోల్డ్ రంగులతో ఎంచుకోగల 4GB RAM + 64GB వేరియంట్ ని మాత్రమే విడుదల చేసింది.                      

 షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ప్రత్యేకతలు (స్పెసిఫికేషన్స్)

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్తో దాని మునుపటి ఫోన్ రెడ్మి నోట్ 5 ప్రో మాదిరిగానే ఉంది. ఇది 19:9 కారక నిష్పత్తిలో కొంచెం పెద్ద ఒక 6.26-అంగుళాల Full HD + IPS LCD డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఇది 86 శాతం స్క్రీన్ నుండి బాడీ నిష్పత్తి, మరియు దాని స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ 500 nits ఇంకా ఇది ఒక 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది షావోమి తెలిపింది. ఈ ఫోన్ 64GB అంతర్గత నిల్వతో పాటు 4GB RAM తో వస్తుంది, అయినప్పటికీ, ఈ రెడ్మి నోట్ 6 ప్రో రెండు వేరియంట్లలో విడుదల కావచ్చని అంచనా.

ఆప్టిక్స్ పరంగా చుస్తే, Redmi Note 6 ప్రో డ్యూయల్  12 + 5 MP సెన్సార్స్ కలిగి వస్తుంది. ఈ 12 MP సెన్సార్ 1.4um పిక్సెళ్ళు మరియు డ్యూయల్  ఆటో-ఫోకస్ మద్దతుతో f / 1.9 ఎపర్చరును కలిగి ఉంది. రెండవ సెన్సార్ 5MP డీప్ సెన్సార్. అలాగే ముందు, ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా   మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది. ముందు కెమెరా ప్రాక్సిమిటీ / పరిసర కాంతి సెన్సర్, స్పీకర్ మరియు నోటిఫికేషన్ లైట్తోపాటు, నోచ్ లోపల ఉంచబడుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ 4000mAh బ్యాటరీ చేత శక్తి పొందుతుంది, ఇది ఒక పూర్తి ఛార్జ్ తో 2 రోజులు వరకు  పనిచేస్తుందని సంస్థ పేర్కొంది.

ఈ స్మార్ట్ ఫోన్ THB 7,000 (రూ .15,713) ధరతో బ్లాక్, బ్లూ అండ్ రోజ్ గోల్డ్ కలర్ మోడల్స్లో లభిస్తుంది. దీనిని భారతదేశంలో లాంచ్ చేసేప్పుడు ఇదే ధరతో తేవచ్చని భావిస్తున్నారు

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo