స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో తదుపరి పెద్ద విషయం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లే కావచ్చు, ఇప్పటికే శామ్సంగ్ వచ్చే ఏడాది ఇటువంటి ఫోన్ను ప్రారంభించాలన్న తన ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్లు అనిపిస్తోంది. సోనీ కూడా తనుకూడా ఏమి తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి, సరికొత్త ప్రణాళికలతో ఇటువంటి ఫోన్లను విడుదల చేయటానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ సంస్థ స్మార్ట్ ఫోనులో ట్రాన్సపరెంట్ డిస్ప్లే (పారదర్శక ప్రదర్శన) కోసం ఒక పద్ధతిని వివరించే పేటెంట్ను దాఖలు చేసింది.
మొదట LetsGoDigital చే గుర్తించబడిన, ఈ పేటెంట్ రెండు డిస్ప్లేలతో కూడిన ఒక స్మార్ట్ ఫోన్ను చూపిస్తుంది. ఒకటి ముందు, మరియు మరొకటి వెనుక. ఓపాక్యూ, ట్రాన్సపరెంట్, ట్రస్లూసెంట్ వలన, ఈ సెట్ ఒక ఆరు రకాల వివిధరకాల మోడ్స్లలో పనిచేస్తుంది. ఈ వెబ్ సైట్ స్మార్ట్ ఫోన్ ఎలా కనిపించాలి అనేదానికి కొన్ని రెండెర్స్ కూడా అందించింది.
ఇది నిజంగా ఒక ఫోనులో డ్యూయల్ డిస్ప్లేని వాడడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం కావచ్చు. అయితే, ఈ సంస్థ మార్కెట్లో తన ప్రాచుర్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఒక చక్కని మార్గం కావచ్చు. ఎందుకంటే, కేవలం ఈ పేటెంటేల్నను పదిన తరువాత కేవలం సోని మాత్రమే అటువంటి పరికరాన్ని తయారుచేయగలుగుతుంది, కానీ ఈ భవిష్య పరికరాలలో సోని దీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తుంది అన్న విషయాన్నీ చెప్పలేము.
ఈ విషయాలన్నీ చూస్తుంటే, 2019 స్మార్ట్ ఫోన్ల కోసం చాలా ఆసక్తికరమైన సంవత్సరంగా ఉండబోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సంస్థలు 5G తో పరికరాల కోసం చూస్తుంటే, శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ పైన దృష్టిపెట్టింది.