రియల్మీ సంస్థ, ఒప్పో నుండి విడిపోయిన తరువాత సెప్టెంబరులో Realme 2 Pro ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తెస్తుంది మరియు Oppo నుండి విడిపోయిన తర్వాత ఇది సంస్థ యొక్క రెండవ ఫోన్ . ముందుగా, ఈ రియల్మీ ప్రో రూ. 13,990 ప్రారంభ ధర వద్ద ఆవిష్కరించారు. కానీ, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పైన రియల్మీ 1,000 రుపాయల తగ్గింపు ప్రకటించింది. కాబట్టి, ఈ రియల్మీ2 ప్రో ని కేవలం రూ.12,990 రూపాయల ప్రారంభ దరతో కొనవచ్చు. అదనంగా, Axis బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. అలాగే, అతితక్కువ EMI ఎంపికలు కూడా అందుబాటులో వున్నాయి.
1. 4GB RAM మరియు 64GB స్టోరేజి అఫర్ ధర – Rs. 12,990 (ముందుగా ఉన్న ధర -Rs.13,990) Link
2. 6GB RAM మరియు 64GB స్టోరేజి అఫర్ ధర – Rs. 14,990 (ముందుగా ఉన్న ధర -Rs.15,990) Link
Realme 2 ప్రో ధర మరియు ప్రత్యేకతలు
రియల్మీ 2 ప్రో ఒక 6.3-అంగుళాల ఫుల్ HD + ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే లో 90.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 19.5: 9 యొక్క యాస్పెక్ట్ రేషియో కలిగిన వాటర్ డ్రాప్ నోచ్ కలిగివుంటుంది. ఈస్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 SoC శక్తితో నడుస్తుంది మరియు అడ్రినో 512 GPU తో జత చేయబడింది. ఇది 4GB RAM + 64GB నిల్వ, 6GB RAM + 64GB నిల్వ మరియు 8GB RAM + 128GB అంతర్గత నిల్వ వంటి మూడు రకాలైన వేరియంట్లలో లభిస్తుంది. ఈ 4GB వేరియంట్ ప్రస్తుత ధర రూ. 12,990. అలాగే, 6GB వేరియంట్ వినియోగదారులకు 14,990 రూపాయలు మరియు 8GB వేరియంట్ 16,990 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. విడుదల సమయంలో, రియల్మి యొక్క ఈ స్మార్ట్ ఈ ధర వద్ద లభించే, ప్రపంచంలో మొట్టమొదటి Dewdrop ఫుల్ స్క్రీన్ అని పేర్కొన్నారు.
రియల్మీ 2 ప్రో ఒక 16MP సోనీ IMX398 ప్రాధమిక 6P సెన్సారుతో బ్యాక్ ప్యానెల్లో డ్యూయల్-కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది, దీనిని ఒక F / 1.7 ఎపర్చరుతో కలిగి ఉంటుంది, ఇది 2MP సెకండరీ లెన్స్ తో జత చేయబడింది. కెమెరా డ్యూయల్ పిక్సెల్ ఫాస్ట్ ఫోకస్ మరియు EIS వీడియో రికార్డింగ్ సామర్థ్యాలను కలిగి ఉంది. వెనుక ప్యానెల్లో కూడా వేలిముద్ర సెన్సార్ ఉంది. ముందు, రియల్ 2 ప్రో ఒక f / 2.0 ఎపర్చరుతో 16MP లెన్స్ తో వస్తుంది. ఫోన్ స్పష్టంగా 296 ముఖ గుర్తింపు పాయింట్లు గుర్తించి ఎనిమిది మిలియన్ వ్యక్తిగతీకరించిన బ్యూటిఫై పరిష్కారాలను అందించే కొత్త AI షాట్ ఫీచర్ తో వస్తుంది. ఈ Realme 2 Pro, Android 8.1 Oreo OS ఆధారితమైన ColorOS 5.2 తో నడుస్తుంది . ఈ ఫోన్ మూడు కలర్ వైవిధ్యాలలో అందుబాటులో ఉంది: ఐస్ లేక్, బ్లాక్ సీ మరియు బ్లూ