హాంగ్ కాంగ్ కంపెని లెనోవో ఈరోజు made in india మేనుఫేక్చరింగ్ ప్లాంట్ పై అనౌన్సమెంట్ చేసింది. లెనోవో మోటోరోలా బ్రాండ్ ను గూగల్ నుండి కొనటం జరిగింది.
ఇప్పుడు ఈ రెండు బ్రాండ్ నేమ్స్ (లెనోవో అండ్ మోటోరోలా) తో ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ తయారు చేయటానికి నిర్ణయించుకుంది కంపెని. చెన్నై లోని తన ప్లాంట్ నుండి గతంలో మోటో E ఫోనులను తయారు చేసింది. ఇప్పుడు లెనోవో K3 నోట్ కూడా ఇదే ప్లాంట్ నుండి తయారు కానున్నాయి అని చెబుతుంది.
ప్రస్తుతం ఈ ప్లాంట్ లో 6 మిలియన్ల ఫోనులు తయారు కాగలవు, అయితే ఈ సంఖ్య 14 మిలియన్ల యూనిట్లకు పెంచేందుకు టార్గెట్ పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఒకే మేనుఫేక్చరింగ్ యూనిట్ లో రెండు బ్రాండ్స్ కు సెపరేట్ గా ఉండనున్నాయి సెక్షన్స్. దీనికి మేన్ పవర్ 1500 ఉద్యోగులు వరకూ పనిచేయనున్నారు టెస్టింగ్ మరియి అసెంబ్లీ విభాగాలలో.
అయితే లెనోవో గతంలో కూడా పర్సనల్ కంప్యూటర్స్ ను తయారు చేయటానికి ఇండియా లో ప్లాంట్ ను పెట్టుకుంది. ఇప్పుడు మొబైల్స్ లో కూడా అంటే సక్సెస్ లైన్ లో ఉంది కంపెని. ఈ made in ఇండియా ప్రాజెక్ట్ కారణంగా లెనోవో k3 నోట్ వంటి ఫోనులు ఆఫ్ లైన్ (రిటేల్ స్టోర్స్) లో బయట దొరికటానికి అవకాశాలు ఉన్నాయి.