డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్.!

డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతున్న iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

iQOO Neo 7 5G మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది

ఫాస్ట్ 4nm ప్రాసెసర్ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా ఫీచర్లతో వచ్చింది

ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8200 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది

ఐకూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ iQOO Neo 7 5G మంచి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లేజింగ్ ఫాస్ట్ 4nm ప్రాసెసర్ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా ఫీచర్లతో వచ్చింది. ఐకూ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పైన లభిస్తున్న ఆఫర్లు,స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు పైన ఒకలుక్కేద్దామా.        

iQOO Neo 7 5G: ధర మరియు ఆఫర్లు

ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (8GB+128GB) ధర రూ.29,999 మరియు 12GB+256GB వేరియంట్ ధర రూ.33,999. Amazon నుండి ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డుతో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 

iQOO Neo 6 5G: స్పెక్స్

ఐకూ నియో 7 5జి స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300Hz నిట్స్ పీక్ బ్రైట్నెస్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లే ని కలిగి వుంది.ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8200 5G ప్రొసెసర్ తో పనిచేస్తుంది. ఇది 4nm ప్రాసెసర్ మరియు దీనికి జతగా గరిష్టంగా 12GB LPDDR5 ర్యామ్ మరియు (UFS 3.1) 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 

కెమేరా విభాగంలో, ఈ లేటెస్ట్ ఐకూ 5G ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో,  64MP OIS ప్రధాన కెమెరాకి జతగా 2MP బొకే మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో వస్తుంది. ముందుభాగంలో, 16MP సెల్ఫీ కెమెరాని సెల్ఫీల కోసం అందించింది. ఈ 5G స్మార్ట్ ఫోన్ ను 5,000mAh బ్యాటరీని 120W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo