హానర్ 8X & హానర్ 8X మ్యాక్స్ చైనాలో విడుదలయ్యాయి
రెండు స్మార్ట్ఫోన్లు చైనీస్ ఇ-టైలర్ వెబ్సైట్ VMall.com లో జాబితా చేయబడ్డాయి. హానర్ 8X ని హానర్ 8X మ్యాక్స్ తో పోల్చినప్పుడు స్పష్టత పరంగా మంచి కెమెరాలు ఉన్నాయి.
గత నెల, Honor 8X స్మార్ట్ఫోన్ TENAA జాబితాలో చూడబడింది మరియు తరువాత ఫోన్ యొక్క స్క్రీన్షాట్లు చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ Weiboలో ఒక పెద్ద స్క్రీన్ పరిమాణం తో స్మార్ట్ఫోన్ పెద్దగా చాల వైవిధ్య భరితంగా కనిపించింది. ఊహాగానాలన్నీ పక్కనపెడితే , Huawei యొక్క ఉప బ్రాండ్ హానర్ చైనా లో రెండు స్మార్ట్ఫోన్లు Honor 8X మరియు హానర్ 8X మాక్స్లను ప్రారంభించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు చైనా యొక్క VMall.com జాబితాలో ఉన్నాయి. విడుదలైన ఈ రెండు స్మార్ట్ఫోన్లలో, హానర్ 8X చిన్నగా ఉంటుంది మరియు 8X మాక్స్ ప్రస్తుతం ఉన్న అతిపెద్ద డిస్ప్లే ఫోన్లలో ఒకటిగా ఉంది. రెండు స్మార్ట్ఫోన్లు గ్లాస్ బ్యాక్ ప్యానెల్లు కలిగి మరియు ఒక డ్యూయల్ – రియర్ కెమెరా సెటప్ కలిగివున్నాయి.
హానర్ 8X స్పెసిఫికేషన్స్ మరియు ధరలు
విడుదలైన రెండింటిలో చిన్నదిగావున్న, ఈ హానర్ 8X యాస్పెక్ రేషియో 18.7:9 మరియు 1080 x 2340 పిక్సెల్స్ అందిచగల ఒక 6.5-అంగుళాల డిస్ప్లే ని కలిగివుంది. ఈ డివైజ్ ఆక్టా కోర్ హై సిలికాన్ కిరిణ్ 710F SoC శక్తితో పనిచేస్తుంది మరియు 4GB / 6GB రెండు రకాలైన వేరియంట్లలో లభిస్తుంది. ఈ హానర్ 8X 64GB/128GB స్టోరేజి ఎంపికలతో వస్తుంది. ఇది EMUI 8.2.0 తో ఆండ్రాయిడ్ 8.1 Oreo తో నడుస్తుంది .
కెమేరా గురించి క్లుప్తంగా, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్ తో డ్యూయల్ కెమెరాని సెటప్ గా పొందింది. దీని ప్రధాన కెమెరా f /1.8 అపేర్చేర్ గల 20MP ప్రధాన సెన్సర్ మరియు ద్వితీయ సెన్సార్గా 2MP ని కలిగివుంది. కీ కెమేరా సెటప్ ఒక LED ఫ్లాష్ తో తో అందించబడింది. ముందు, f /2.0 అపేర్చేర్తో కూడిన 16MP కెమేరాని కలిగివుంటుంది. ఇంకా 3,750 mAh పెద్ద బ్యాటరీ మరియు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
సెప్టెంబరు 6 న, ఈ స్మార్ట్ఫోన్ నుండి కొనుగోలు చేయవచ్చు. షిప్పింగ్ సెప్టెంబర్ 11 నుండి ప్రారంభమవుతుంది. హానర్ 8X 4G / 64GB మోడల్ కోసం యువాన్ 1,399 (సుమారు రూ. 14,700) ప్రారంభ ధరపై లభిస్తుంది, యువాన్ 1,599 (సుమారు రూ. 16,800) 6GB / 64GB మోడల్ మరియు యువాన్ 1,899 (సుమారు Rs. 20,000) కోసం 6GB / 128GB వేరియంట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.
హానర్ 8X మ్యాక్స్ స్పెసిఫికేషన్స్ మరియు ధరలు
హానర్ 8X మ్యాక్స్ 1080×2244 రిజల్యూషన్ మరియు 19.5: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక భారీ 7.12-అంగుళాల పూర్తి HD + TFT IPS డిస్ప్లేపై 'వాటర్డ్రోప్' నోచ్ ని కలిగి ఉంది. స్మార్ట్ఫోన్ ఒక ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 SoC చేత మరియు 4GB RAM తో అందించింది. కొనుగోలుదారులు రెండు స్టోరేజి ఎంపికల మధ్య ఎంచుకోవచ్చు: 64GB మరియు 128GB – మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించదగినవి. స్మార్ట్ఫోన్ Android 8.1 Oreo తో EMUI 8.2.0 స్కిన్ పై నడుస్తుంది. వెనుకవైపు, స్మార్ట్ఫోన్ ఒక డ్యూయల్ – కెమెరా సెటప్ను కలిగి ఉంది – f / 2.0 ఎపర్చరుతో ఒక 16MP ప్రాధమిక లెన్స్ మరియు f / 2.4 ఎపర్చరుతో 2MP సెకండరీ సెన్సర్. ముందు, f / 2.0 ఎపర్చరుతో ఒక 8MP లెన్స్ ఉంది. హానర్ 8X మ్యాక్స్ ఒక భారీ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.
హానర్ 8X వలనే, హానర్ 8X మాక్స్ కూడా చైనాలో ముందుగా ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది 4GB / 64GB వేరియంట్ మరియు 4GB / 128GB మోడల్ కోసం యువాన్ 1,799 (సుమారు రూ. 19,000) కోసం యువాన్ 1,499 (సుమారు రూ .15,7000) ధర వద్ద లభ్యమవుతుంది. నివేదిక ప్రకారం, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ మరియు 6 జీబి ర్యామ్లను అక్టోబర్లో విక్రయించబోయే మరో నమూనా కూడా ఉంది.