ఇండియాలో ఒప్పో k1 విడుదలకి సర్వం సిద్ధం
Flipkart భాగస్వామ్యంతో సేల్ .
ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సారుతో, గత సంవత్సరం చైనాలో విడుదల చేయబడిన ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి, Oppo K1 ఇప్పుడు ఇండియాలో విడుదలకానుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ కోసం ఇప్పుడు మీడియాకు ఆహ్వానాలను అందించింది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ కూడా తన వెబ్సైటులో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ తో దీని గురించి వివరిస్తోంది.
ఈ Oppo K1 స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్, ఫిబ్రవరి 6 న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
Oppo K1 ప్రత్యేకతలు
గత సంవత్సరం చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.4 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. ఇది 2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది చైనాలో 4GB మరియు 6GB వంటి రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇక చైనాలో ధరలను గురించి చూస్తే కనుక, ఈ 4GB వేరియంట్ 1,599 యువాన్ (సుమారు రూ. 16,850) మరియు 6GB వేరియంట్ 1,799 యువాన్ (సుమారు రూ. 19,000) ధరతో వచ్చాయి. అయితే, భారతదేశంలో విడుదలయ్యేప్పుడు వీటి ధరలలో మార్పు వుండవచ్చు.
కెమేరాల విషయానికి వస్తే, వెనుక 16MP కెమేరాకు జతగా మరొక 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరాతో ఉంటుంది. ఇక ముందుభాగంలో ఒక 25MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 తో నడుస్తుంది.