మొబైల్ ఫోన్ మరియు ల్యాండ్ లైన్ వినియోగదారులు ఇప్పుడు ప్రముఖ టెలికాం నెట్వర్క్ లకు టెలికాం (డాట్) శాఖ తాజగా పెట్టిన నిబంధన ప్రకారం, ఫోన్ నంబర్ డయిల్ చేసేముందు '0' లేదా '+91' ఉపయోగించే అవసరం లేకుండా ఏ STD నంబర్ ను అయినా డయల్ చేయవచ్చు.
TRAI ప్రవేశపెట్టిన ఈ కొత్త అవకాశం వెనుక కారణం దేశంలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని పూర్తిగా తీసుకురావటం గురించే. దాదాపు అని లీడింగ్ మొబైల్ నెట్వర్క్ లు దీనిని మొదలు పెట్టారు. మిగతా ఆపరేటర్లు ఇంకా టెక్నికల్ అంశాలను ట్రైల్ చెకింగ్ చేసుకుంటున్నారు. వోడాఫోన్ అప్పుడే దీనిని అమల్లోకి తెచ్చేసింది. MTS అధినేతలు కూడా ఈ సదుపాయాన్ని 9 సర్కిల్స్ లో అమలు చేసారు."మేము ఇప్పటికే ట్రైల్ రన్స్ ను కూడా చేసేసాము, మా సబ్స్క్రైబర్స్ వెంటనే ఈ అవకాశాన్ని పొందవచ్చు" అని అన్నారు.
ఇండియన్ సెల్యులార్ ఆపరేషన్స్ జెనెరల్ డైరెక్టర్ రాజన్ ఎస్ మేథ్యూస్ దీని గురించి మాట్లాడుతూ…" ఇది కేవలం MNP ను సులభతరం చేయటానికే అమలు చేసాము. ఇది చేయకపోతే MNP ను ఇంప్లిమెంట్ చేయటానికి 9 నెలలు పట్టేది." MNP ను పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రోసెస్ లన్నీ పూర్తి చేయమని టెలికాం ఆపరేటర్లు కు ఆదేశించారు. ఎందుకంటే ఏ ఒక్క కంపెని ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురాకపోతే, పూర్తి చేసుకున్న ఆపరేటర్ల సబ్స్క్రైబర్స్ కు ఇబ్బంది గా ఉంటుంది" అని అన్నారు."
మే 3 వ తారీఖున ఇంప్లిమెంట్ అవ్వవలసిన పాన్ ఇండియా మొబిలిటీ, కొన్ని టెక్నికల్ కారణాల రిత్యా రెండు నెలలు ఎక్స్టెన్షన్ చేసుకోవటం జరిగింది. పాన్ ఇండియా ఇప్పుడు మొబైల్ సబ్స్క్రైబర్స్ అందరికి దేశంలోని ఏ మొబైల్ నెట్వర్క్ అయినా ఏ టెలికాం సర్కిల్ లో ఎటువంటి రోమింగ్ చార్జెస్ లేకుండా ఫ్రీగా వాడుకోవచ్చు. తాజాగా పెట్టిన డేడ్లైన్ తో మొబైల్ నంబర్ పోర్టబిలిటీని ఈ సంవత్సరం జూలై కి పూర్తిగా వినియోగంలోకి వస్తాయి.
ఆధారం: బిజినెస్ టుడే