CMF Phone 1 పేరుతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన నథింగ్ ఫోన్ సబ్ బ్రాండ్.!
కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన నథింగ్ సబ్ బ్రాండ్ CMF
CMF Phone 1 పేరుతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన నథింగ్ సబ్ బ్రాండ్
టీజర్ ఇమేజ్ తో అప్ కమింగ్ ఫోన్ గురించి అనౌన్స్ చేసింది
CMF Phone 1 పేరుతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన నథింగ్ ఫోన్ సబ్ బ్రాండ్ సిఎమ్ఎఫ్. ఇండియాలో బడ్జెట్ స్మార్ ఫోన్ మార్జిన్ లో వాటా పంచుకోవడానికి కొత్త బ్రాండ్ బరిలోకి దిగుతోంది. దేశంలో ఇప్పటికే అనేక బ్రాండ్ లు బడ్జెట్ కేటగిరిలో పోటా పోటీగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ కేటగిరిలో మరొక బ్రాండ్ గ్రాండ్ ఎంట్రీ కోసం రెడీగా వుంది. వాస్తవానికి, నథింగ్ సబ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ వస్తుందని లీక్స్ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటలను నిజం చేస్తూ కంపెనీ నుండి అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చింది.
CMF Phone 1
ఇండియాలో నథింగ్ బ్రాండ్ ఇప్పుడు భారీగా ఆదరణ అందుకుంటోంది. ముందుగా ప్రీమియం ఫోన్ లను విడుదల చేసిన నథింగ్, మిడ్ రేంజ్ ఫోన్ లను సైతం విడుదల చేసింది. రీసెంట్ గా నథింగ్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన Phone 2(a) ఫోన్ మంచి ఆదరణ పొందింది. అందుకే, ఫోన్ 2(a) న్యూ కలర్ వేరియంట్ లను కూడా అనౌన్స్ చేసింది.
ఇప్పటికే ప్రీమియం మరియు మిడ్ రేంజ్ లలో నథింగ్ బ్రాండ్ నుండి ఫోన్ లను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు ఈ కంపెనీ సబ్ బ్రాండ్ నుండి బడ్జెట్ ఫోన్ ను తీసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ను 5G ఫోన్ గా తీసుకు రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. కంపెనీ టీజర్ ఇమేజ్ తో అప్ కమింగ్ ఫోన్ గురించి అనౌన్స్ చేసింది.
Also Read: BSNL: ఇక SIM Cards నేరుగా ఇంటికి డెలివరీ చేస్తానంటున్న ప్రభుత్వ టెలికాం.!
CMF by Nothing కంపెనీ అధికారిక X అకౌంట్ నుండి ఈ టీజర్ ను పోస్ట్ చేసింది. CMF Phone 1 ను ను ఇండియాలో పరిచయం చేయనున్నామని తెలిపింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఎక్స్ పెక్టడ్ ఫీచర్స్ తో ఇప్పటికే చాలా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కంపెనీ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇవన్నీ కూడా చిటికెడు ఉప్పు కింద మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
నథింగ్ సబ్ బ్రాండ్ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ ఆరంజ్ కలర్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ వెనుక పెద్ద రౌండ్ నాబ్ కనిపిస్తోంది. ఇది పాతకాలం ప్రీమియం ఆంప్లిఫయర్ లలో కనిపించే సౌండ్ నాబ్ మాదిరిగా కనిపిస్తోంది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజ్ ను కూడా అందించింది. నథింగ్ సబ్ బ్రాండ్ ఇప్పటికే TWS బడ్స్, నెక్ బ్యాండ్ మరియు స్మార్ట్ వాచ్ లను అందించింది. ఇప్పుడు ఈ సబ్ బ్రాండ్ లిస్ట్ లో స్మార్ట్ ఫోన్ కూడా చేరబోతోంది.