CMF Phone 2 టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ.!

CMF Phone 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది
ఫోన్ పేరును ప్రకటించకుండానే ఈ ఫోన్ యొక్క టీజింగ్ మొదలు పెట్టింది
ఈ ఫోన్ గురించి ఇప్పటికే చాలా లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి
CMF Phone 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది. ఫోన్ పేరును ప్రకటించకుండానే ఈ ఫోన్ యొక్క టీజింగ్ మొదలు పెట్టింది. గత సంవత్సరం CMF అందించిన ఫోన్ 1 యొక్క నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను తీసుకు వస్తోంది. ఇది కచ్చితంగా సిఎంఎఫ్ ఫోన్ 2 అవుతుంది మరియు ఈ ఫోన్ గురించి ఇప్పటికే చాలా లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కంపెనీ ఈరోజు అఫీషియల్ గా అప్ కమింగ్ ఫోన్ గురించి టీజింగ్ అందించింది.
CMF Phone 2 : లాంచ్ డేట్ ఏమిటి?
సిఎంఎఫ్ ఫోన్ 2 లాంచ్ డేట్ లేదా మారె ఇతర వివరాలు ఇన్ కా బయటకు రాలేదు. కంపెనీ ఈ ఫోన్ గురించి ఎటువంటి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ వీడియోలో మాత్రం ఈ ఫోన్ యొక్క ప్రత్యేకమైన ఫీచర్ గురించి వెల్లడించింది. ఈ ఫోన్ ను Flipkart ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఒరత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది.
Also Read: Prime Video యూజర్లకు గుడ్ గుడ్ న్యూస్ Apple TV+ ని యాడ్ ఆన్ ప్యాక్ గా ఆఫర్ చేస్తోంది.!
CMF Phone 2 : ఫీచర్స్
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క ఒక కీలకమైన ఫీచర్ గురించి మాత్రం కంపెనీ బయటపెట్టింది. అదేమిటంటే, ఈ ఫోన్ గొప్ప వివరాలు కలిగిన కెమెరా కలిగి ఉంటుంది, అని మాత్రం తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగి ఉండే కెమెరా సెటప్ ని తెలిపే బ్యాక్ ప్యానల్ తో టీజర్ వీడియో ను అందించింది.
వాస్తవానికి, ఇటీవల వచ్చిన కొన్ని లీక్స్ ద్వారా ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చని అంచనా వేశారు. అయితే, కంపెనీ టీజర్ వీడియో ద్వారా ఈ ఫోన్ లో కేవలం సింగల్ కెమెరా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ కెమెరా బంప్ ను పరిగణలోకి తీసుకున్నా డ్యూయల్ కెమెరాని మించి ఉండే అవకాశం లేదు.
CMF Phone 2 : అంచనా ఫీచర్స్
ప్రస్తుతం ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న కొన్ని లీక్స్ ద్వారా ఈ అప్ కమింగ్ CMF ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ లో HDR 10+ సపోర్ట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.3 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది కాబట్టి ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు కీలకమైన వివరాలు కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.