digit zero1 awards

CMF Phone 1: ఎట్టకేలకు ఫోన్ ఫుల్ డిజైన్ మరియు కలర్ వేరియంట్ ప్రకటించిన నథింగ్.!

CMF Phone 1: ఎట్టకేలకు ఫోన్ ఫుల్ డిజైన్ మరియు కలర్ వేరియంట్ ప్రకటించిన నథింగ్.!
HIGHLIGHTS

ఎట్టకేలకు ఫోన్ ఫుల్ డిజైన్ మరియు కలర్ వేరియంట్లను నథింగ్ ఈ రోజు ప్రకటించింది

CMF Phone 1 మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది

CMF Phone 1 ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెగ్యులర్ ఫోన్ లకు భిన్నంగా ఉంది

CMF Phone 1: ఎట్టకేలకు ఫోన్ ఫుల్ డిజైన్ మరియు కలర్ వేరియంట్లను నథింగ్ ఈ రోజు ప్రకటించింది. ఈ ఫోన్ ను మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ ను ఇప్పటి వరకూ చాలా సీక్రెట్ గా ఉంచిన నథింగ్, ఈ రోజు బయటికి వెల్లడించింది. ఈ ఫోన్ లో ఉన్న రౌండ్ నాబ్ గురించి చాలా కాలంగా టీజింగ్ చేస్తూ వచ్చిన కంపెనీ, ఈ రోజు దాని ఉపయోగాలు కూడా బయటపెట్టింది.

CMF Phone 1 ఎలా వుంది?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెగ్యులర్ ఫోన్ లకు భిన్నంగా ఉంది ఈ సిఎంఎఫ్ ఫోన్ 1. ఎందుకంటే, ఈ ఫోన్ ను డిఫరెంట్ లుక్ మరియు ఎక్స్ట్రా ఫీచర్లతో నథింగ్ అందించింది. ఈ ఫోన్ లో వెనుక అందించిన స్క్రూ సెటప్ ద్వారా ఈ ఫోన్ కు పవర్ బ్యాంక్ ను అటాచ్ చేసుకునే వీలుంది. అంతేకాదు, ఈ ఫోన్ వెనుక భాగంలో కలిగివున్న రౌండ్ నాబ్ ను ఫోన్ ను తగిలించుకునే హాంగర్ లేదా ఫోన్ టేబుల్ పెట్టడానికి వాడే హోల్డర్ గా కూడా ఉపయోగించే వీలున్నట్లు ఇమేజ్ ల ద్వారా చూపించింది.

CMF Phone 1
CMF Phone 1

సాధారణంగా ప్రతి ఫోన్ తో పాటుగా చిన్న SIM ఎజెక్ట్ పిన్ వస్తుంది. అయితే, ఈ ఫోన్ తో డిఫరెంట్ SIM ఎజెక్ట్ పిన్ వస్తుంది. ఇది ఒకవైపు సన్నని సిమ్ ఎజెక్ట్ పిన్ ను మరో వైపు సన్నని స్క్రూడ్రైవర్ ను కలిగి ఉంటుంది. ఇది ఫోన్ లో అందించిన స్క్రూలు ఫిట్ చేయడానికి లేదా తొలగించడానికి ఉపయోగపడుతుంది.

Also Read: 64MP డ్యూయల్ కెమెరా స్టన్నింగ్ డిజైన్ తో వస్తున్న Lava Blaze X స్మార్ట్ ఫోన్.!

ఇక కలర్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను బ్లాక్, ఆరెంజ్ మరియు బ్లూ కలర్ లలో విడుదల చేయబోతున్నట్లు టీజర్ ఇమేజ్ లలో చూపించింది. ఈ ఫోన్ లో వెనుక 50 Sony డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ Super AMOLED స్క్రీన్, మీడియాటెక్ Dimensity 7300 5జి ప్రోసెసర్ మరియు 8GB ర్యామ్ + 8GB ర్యామ్ బూస్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది.

ఇవి మాత్రమే కాదు ఈ ఫోన్ లో టైప్ C పోర్ట్ మరియు పెద్ద స్పీకర్ గ్రిల్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ మరియు బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుందని ఊహిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo