Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. ధర మరియు ఫీచర్లు ఇవే.!
Nothing Phone (2a) ను మరింత కొనసాగిస్తూ, కొత్త స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది
కంపెనీ రీసెంట్ గా బ్లూ కలర్ వేరియంట్ ను విడుదల చేసిం
ఇప్పుడు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ను కూడా తీసుకు వచ్చింది
నథింగ్ బ్రాండ్ యొక్క సక్సెస్ ఫుల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (2a) ను మరింత కొనసాగిస్తూ, కొత్త స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ను ఆకర్షణీయమైన మల్టీ కలర్ లతో మరింత ఆకట్టుకునేలా అందించింది. నథింగ్ ఫోన్ (2a) ఇండియన్ మార్కెట్ ను లో మంచి అమ్మకాలను సాధించింది. ఈ ఫోన్ పైన అందుకున్న స్పందనకు అనుగుణంగా, కంపెనీ రీసెంట్ గా బ్లూ కలర్ వేరియంట్ ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ను కూడా తీసుకు వచ్చింది.
Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్: ప్రైస్
నథింగ్ ఫోన్ (2a) స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కేవలం 12GB + 256GB సింగిల్ వేరియంట్ లో మాత్రమే అందించింది. ఈ వేరియంట్ ను రూ. రూ. 27,999 ధరతో అందించింది. ఈ ఫోన్ జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Nothing Phone (2a) స్పెషల్ ఎడిషన్: ప్రత్యేకతలు
వాస్తవానికి, ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మరియు రెగ్యులర్ నథింగ్ ఫోన్ (2a) అల్లూ స్పెక్స్ పరంగా వ్యత్యాసం లేదు. కానీ కలర్ పరంగా ఈ ఫోన్ ను మరింత ఆకర్షణీయంగా అందించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కొత్త ఎడిషన్ ఫోన్ వైట్ కలర్ లో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో కెమెరా బంప్ బ్లూ కలర్ లో ఫ్లాష్ లైట్ ను రెడ్ కలర్ తో మరియు RGB లైట్ సిస్టం చుట్టూ పసుపు కలర్ స్ట్రిప్ లతో చాలా ఆకర్షణీయంగా చేసింది.
ఇక ఫీచర్స్ పరంగా, ఈ ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7200 Pro ప్రోసెసర్ వుంది మరియు దీనికి జతగా 12GB RAM మరియు 8GB ర్యామ్ బూస్టర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టం కూడా వుంది. ఈ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ బిగ్ AMOELD డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ HDR 10+ తో వస్తుంది మరియు 91.5% స్క్రీన్ టూ బాడీ రేషియాతో ఎక్కువ స్క్రీన్ భాగాన్ని కలిగి ఉంటుంది.
Also Read: ఇక నుండి సర్వీస్ ఇన్ కమింగ్ కాల్స్ కోసం కొత్త 160 యూనిఫామ్ నెంబర్ మాత్రమే ఉంటుంది.!
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా కలిగి వుంది. మెయిన్ కెమెరా OIS మరియు EIS సపోర్ట్ లతో వస్తుంది మరియు 30fps వద్ద 4K వీడియోలు షూట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాతో చాలా ఫిల్టర్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5,000 mAh బిగ్ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.