Nothing Phone (2a) Plus: గొప్ప డిజైన్ తో మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో వచ్చింది.!

Nothing Phone (2a) Plus: గొప్ప డిజైన్ తో మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో వచ్చింది.!
HIGHLIGHTS

నథింగ్ ఈరోజు కొత్త ఫోన్ Nothing Phone (2a) Plus ను విడుదల చేసింది

ఫోన్ (2a) నెక్స్ట్ జనరేషన్ గా నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ ఫోన్ ను ఆకట్టుకునే ధరలో గొప్ప డిజైన్ తో మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది

Nothing Phone (2a) Plus: నథింగ్ ఈరోజు కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఫోన్ (2a) నెక్స్ట్ జనరేషన్ గా నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకట్టుకునే ధరలో గొప్ప డిజైన్ తో మరియు ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈరోజు భారత మార్కెట్లో సరికొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర మరియు ఫీచర్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Nothing Phone (2a) Plus: ప్రైస్

నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB బేసిక్ వేరియంట్ ను రూ. 27,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క రెండవ 12GB + 256GB హైఎండ్ వేరియంట్ ను రూ. 29,999 ధరతో విడుదల చేసింది.

ఆఫర్స్:

ఈ ఫోన్ లాంచ్ సయమంలో ఈ ఫోన్ అందిస్తున్న లాంచ్ ఆఫర్లు కూడా నథింగ్ వెల్లడించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ను అందించింది. అంటే, బ్యాంక్ కార్డు తో ఈ ఫోన్ ను రూ. 25,999 రూపాయల ప్రారంభ ధరకే అందుకునే అవకాశం అందించింది.

Nothing Phone (2a) Plus: ఫీచర్లు

నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ కొత్త ఫోన్ ను MediaTek లేటెస్ట్ 5జి చిప్ సెట్ Dimensity 7350 Pro 5G తో తీసుకు వచ్చింది. ఇది 4nm Gen 2 TSMC ప్రోసెసర్ మరియు జతగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.

Nothing Phone (2a) Plus

నథింగ్ ఫోన్ (2a) ప్లస్ లో వెనుక డ్యూయల్ 50MP కెమెరా సెటప్ మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో, 50MP Samsung GN9 ప్రైమ్ కెమెరా, 50MP Samsung JN1 అల్ట్రా వైడ్ సెకండరీ కెమెరా మరియు 50MP Samsung JN1 సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 30 FPS వద్ద 4K వీడియో లను పొందవచ్చు. అంతేకాదు, Ultra XDR, AI Vivid మోడ్ మరియు పోర్ట్రైట్ ఆప్టిమైజర్ వంటి చాలా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు కూడా పొందవచ్చని నథింగ్ తెలిపింది.

Also Read: JioBharat J1 4G: రూ. 1,799 కే OTT , UPI మరియు TV ప్రయోజనాలతో కొత్త ఫోన్ తెచ్చిన జియో.!

ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి మరియు ఇది Nothing OS 2.6 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ ,లో 5000 mAh బ్యాటరీ వుంది మరియు ఇది 50W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo