Nothing Phone (2a) Plus: డ్యూయల్ 50MP కెమెరా మరియు 20GB RAM ర్యామ్ తో రేపు లాంచ్ అవుతుంది.!
నథింగ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది
Nothing Phone (2a) Plus ను ఇండియాలో విడుదల చేస్తోంది
ఈ ఫోన్ ను డ్యూయల్ 50MP కెమెరా, 20GB RAM ర్యామ్ తో రేపు లాంచ్ చేస్తుంది
Nothing Phone (2a) Plus: నథింగ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. ఇటీవల నథింగ్ తీసుకు వచ్చిన బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ నథింగ్ ఫోన్ (2a) యొక్క నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఫోన్ (2a) ప్లస్ ను ఇండియాలో విడుదల చేస్తోంది. నథింగ్ ఈ అప్ కమింగ్ ఫోన్ ను డ్యూయల్ 50MP కెమెరా మరియు 20GB RAM ర్యామ్ తో రేపు లాంచ్ చేస్తుంది.
Nothing Phone (2a) Plus: లాంచ్
నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ ను Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. నథింగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.
Nothing Phone (2a) Plus: ఫీచర్స్
నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 7350 తో విడుదల చేస్తుంది. ఈ ప్రోసెసర్ 4nm చిప్ సెట్ మరియు ఇది 3.0GHz క్లాక్ స్పీడ్ తో ఉంటుంది. అంతేకాదు, ఇందులో గేమింగ్ కోసం మీడియాటెక్ Hyper Engine 5.0 తో గేమింగ్ కి మంచి అనువైన చిప్ సెట్ గా ఉంటుంది. అంతేకాదు, నేటి కాలానికి తగిన AI ఫీచర్స్ తో ఈ చిప్ సెట్ ను మీడియాటెక్ అందించింది.
కేవలం ప్రోసెసర్ మాత్రమే కాదు దానికి తగిన ర్యామ్ మరియు ర్యామ్ ఫీచర్స్ ను కూడా నథింగ్ ఈ ఫోన్ లో జత చేసింది. మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి తగిన 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో టోటల్ 20GB ర్యామ్ సపోర్ట్ ను ఈ ఫోన్ లో అందిస్తుంది.
Also Read: Jio Best Plans: మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
నథింగ్ ఫోన్ లలో ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను ఈ ఫోన్ లో కూడా అందిస్తున్నట్లు నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ లో కూడా 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు నథింగ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ కలిగిన AI సహాయంతో ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందించే అవకాశం ఉండవచ్చు.
నథింగ్ ఫోన్ (2a) ఫోన్ ను 25 వేల ఉప బడ్జెట్ లో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించిన నథింగ్ ఈ ఫోన్ ను ఏ ధర పరిధిలో అందిస్తుందో చూడాలి.