Nothing Phone (2a) Plus: 20GB ర్యామ్ మరియు సరికొత్త చిప్ సెట్ తో వస్తుంది.!
నథింగ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కోసం సిద్ధం అవుతోంది
Nothing Phone (2a) Plus ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేస్తుందని తెలిపింది
ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ తెలిపేలా ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు ర్యామ్ వివరాలతో ఆటపట్టిస్తోంది
Nothing Phone (2a) Plus: నథింగ్ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కోసం సిద్ధం అవుతోంది. నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేస్తుందని తెలిపింది. ఈ ఫోన్ ను మరిన్ని ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు నథింగ్ టీజింగ్ మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ తెలిపేలా ఈ ఫోన్ ప్రోసెసర్ మరియు ర్యామ్ వివరాలతో ఆటపట్టిస్తోంది.
Nothing Phone (2a) Plus
నథింగ్ ఫోన్ (2a) ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ప్రస్తుతానికి బయట పెట్టలేదు. కానీ, ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఆటపట్టిస్తోంది. ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మన్స్ ను వివరించేలా ఈ ఫోన్ ఫీచర్స్ ను నథింగ్ ఈ రోజు బయట పెట్టింది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7350 Pro 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందని నథింగ్ ప్రకటించింది. ప్రపంచం మొత్తం మీద ఈ చిప్ సెట్ తో విడుదలయ్యే మొదటి ఫోన్ ఇదే అవుతుంది అని కూడా నథింగ్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో టోటల్ 20GB ర్యామ్ ఫీచర్ తో వస్తుందని కూడా నథింగ్ గొప్పగా చెబుతోంది.
ఈ ప్రోసెసర్ శక్తివంతమైనదని మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా నథింగ్ తెలిపింది. ఈ ప్రోసెసర్ 3.0 GHz క్లాక్ స్పీడ్ తో ఉంటుందని Mali-G610 MC4 GPU గొప్ప గేమింగ్ అందిస్తుందని కూడా తెలిపింది. ఈ ఫోన్ ప్రోసెసర్ పెర్ఫార్మెన్స్ పరంగా నథింగ్ ఫోన్ (2a) కంటే ఓవరాల్ గా 10% వేగంగా ఉంటుందని కూడా చెబుతోంది.
Also Read: HMD Crest Series నుంచి బడ్జెట్ ధరలో రెండు కొత్త ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
నథింగ్ రీసెంట్ గా బడ్జెట్ కేటగిరిలో కూడా తన ఉప బ్రాండ్ CMF ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టింది. అలాగే, ముందు నుంచి 25 వేల ఉప బడ్జెట్ లో ఫోన్ (2a) తో మంచి పేరు తెచ్చుకున్న నథింగ్, ఇప్పుడు ఈ ఫోన్ తో ఇంకా ఏ బడ్జెట్ పైన టార్గెట్ చేస్తుందో అని నిపుణులు అంచనాలు వేయండం మొదలు పెట్టారు.
గమనిక: మెయిన్ ఇమేజ్ అప్ కమింగ్ ను నథింగ్ ఫోన్ (2a) ప్లస్ ఫోనుది కాదని, నథింగ్ ఫోన్ (2a) ఫోన్ ఇమేజ్ అని గమనించాలి.